చిలగడదుంప వడలు
- August 15, 2017
కావలసిన పదార్థాలు
చిలగడ దుంపలు - 300 గ్రా., ఉల్లిపాయ - ఒకటి, పచ్చిమిర్చి - 3, అల్లం వెల్లుల్లి పేస్టు - పావు టీ స్పూను, కరివేపాకు - 4 రెబ్బలు, పసుపు - పావు టీ స్పూను, కార్న్‌ఫ్లోర్ - 2 టేబుల్ స్పూన్లు, బియ్యప్పిండి - 1 టీ స్పూను, గరం మసాల - పావు టీ స్పూను, ఉప్పు - రుచికి సరిపడా, నూనె - వేగించడానికి సరిపడా.
తయారుచేసే విధానం
చిలగడ దుంపల్ని మెత్తగా ఉడికించి చల్లారిన తర్వాత తొక్క తీసి మెదపాలి. ఈ గుజ్జులో ఉల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు తరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, బియ్యప్పిండి, కార్న్‌ఫ్లోర్, ఉప్పు వేసి ముద్దలా చేసుకోవాలి. తర్వాత దుంపల మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని వడల్లా ఒత్తి నూనెలో దోరగా వేగించుకోవాలి. సాయంత్రం స్నాక్స్‌గా టీతో పాటు తింటే బాగుంటాయి.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్‌లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







