పైసా వసూల్ ఆడియో వేడుక లో అదరకొట్టిన బాలయ్య స్పీచ్
- August 18, 2017
తాజాగా జరిగిన పైసా వసూల్ ఆడియో వేడుక లో బాలయ్య స్పీచ్ అద్భుతంగా సాగింది. అభిమానులకి ఫుల్ జోష్ ఇస్తున్న బాలయ్యబాబు మద్యం పైన చాలా ఫేమస్ అయిన ఒక దండకం స్వయంగా తానే చదివి వినిపించారు అందరికీ. "ఓ బ్రాందీ, ఓ విస్కీ, ఓ రమ్ము ఎంతో రుచిరా... ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా... పాల మీగడలకన్నా, పంచదార చిలకలకన్నా, ఓ సారా నీ నామ మెంతో రుచిరా...
ఓ సారా దేవా... నీవు బీరువై, బ్రాందివై, విస్కీవై, రమ్మువై, జిన్నువై, కాక్ టేలువై, గుడుంబావై, నాటు సారావై, డైలీ దేవుండవై, సంపూర్ణ మత్తు సిద్ధివై, రసస్ఫూర్తివై, రసాధి దేవతవై..." అలా వెళ్ళింది ఈ దండకం. బాలయ్య నోట్లోంచి ఇలాంటి దండకం రావడం తో ఫాన్స్ ఫుల్ ఖుషీ అయిపోయారు.
"ఆల్కహాలువై, ఈతకల్లువై, తాటికల్లువై, ద్రాక్షసారావివై, మందు నామాంతరమ్మువై, ప్రత్యక్ష దైవంబువై వచ్చి, మా నాల్కపై నిలిచి, మా గొంతులో జారి, ఉదరమ్ములో కొలువుండి, ఆఖలి బాధలు తప్పించి, ఈతి బాధలు మరిపించి, తారతమ్యాలు లేవనుచు మాకు బ్రహ్మానందమ్ము ప్రసాదించుము. ఓ దేవా, ఓ సారా దేవా... నమస్తే నమస్తే నమః" అంటూ బాలయ్య పాడుతూ ఉంటె అభిమానులు కేరింతలు కొట్టారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







