'ట్రంప్' ఆట
- August 19, 2017
ఎన్నికల్లో తాను విజయం సాధించడానికి అహోరాత్రులూ శ్రమించిన ఒక్కొక్కరినీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వదిలించుకుంటున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వారికి ఉన్నత పదవులు కట్టబెట్టి.. ఇప్పుడు బయటకు పంపిస్తున్నారు. తాజాగా, శ్వేతసౌధ ముఖ్య వ్యూహకర్త స్టీఫెన్ బానన్ ఆ పదవి నుంచి తప్పుకొన్నారు. రెండు రోజుల కిందటే ‘‘బానన్ చాలా మంచి వ్యక్తి. ఆయనంటే నాకు చాలా ఇష్టం’’ అని వ్యాఖ్యానించిన ట్రంప్.. గురువారమే పదవి పీకి ఇంటికి పంపేశారు. గత ఏడాది కాలంలో ట్రంప్ ఇలా అర్ధాంతరంగా వేటు వేసిన వారిలో బానన్ మూడో వ్యక్తి. ఇంతకుముందు, శ్వేతసౌధం చీఫ్ ఆఫ్ స్టాఫ్ రీన్స్ ప్రీబస్, శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ సీన్ స్పైసర్లను ఆయన ఇంటికి పంపేశారు. ‘‘మితవాద కన్జర్వేటివ్‌లు కష్టపడి ట్రంప్‌ను అధ్యక్షుడిని చేశారు. నేటితో ఆ మితవాద అధ్యక్షస్వామ్యం ముగిసింది. ఇక ఇప్పుడు ఆయన రిపబ్లికన్లు తీర్చిదిద్దిన ఆధునిక ట్రంప్’’ అని వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







