రైళ్ల పై పడిన అల్పపీడన ప్రభావం
- August 19, 2017ఒడిశా తీరం వైపు ఏర్పడిన అల్పపీడనం శనివారానికి ఉత్తర కోస్తాంధ్ర, దాని చుట్టు పక్కల ప్రాంతాలవైపు వచ్చిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనంతో కలిసి కదులుతోంది. దీని ప్రభావంతో కోస్తాలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని.. రాష్ట్రవ్యాప్తంగా మరో 3, 4రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుకురిసే అవకాశాలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. రాష్ట్రం మీదుగా ఏర్పడిన ద్రోణి కొనసాగుతోందన్నారు.
ఏపీ మీదుగా వెళ్లే పలు రైళ్ల రద్దు
బిహార్, పశ్చిమబంగ సరిహద్దుల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్ మీదుగా దక్షిణాది రాష్ట్రాలకు వెళ్లే పలు రైళ్లను రద్దు చేసినట్లు ఉత్తర సరిహద్దు రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. కిషన్‌గంజ్, పంజిపరా రైల్వేస్టేషన్ల మధ్య రైల్వేట్రాక్‌లపై వర్షాల ప్రభావం తీవ్రంగా ఉన్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
రద్దయిన రైళ్ల వివరాలు తేదీల వారీగా...

తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







