శ్రద్దా కపూర్ తో జోడి కట్టనున్న ప్రభాస్
- August 19, 2017
ప్రభాస్ బాలీవుడ్ పై ఫుల్ ఫోకస్ పెట్టాడు. బాహుబలి ది బిగినింగ్ తర్వాత బీటౌన్ నుంచి ఆఫర్స్ వచ్చినా, రిజక్ట్ చేసిన యంగ్ రెబల్ స్టార్, ఇప్పుడు టోటల్ గా ఛేంజ్ అయిపోతున్నాడు. బొంబైలో జెండాపాతాలని గట్టిగా ట్రై చేస్తున్నాడు. సాహో సినిమాలో బాలీవుడ్ స్టార్స్ ను నింపేసి, అక్కడ స్ట్రాంగ్ మార్కెట్ సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.
ప్రభాస్ బాహుబలి సీరిస్ తో వచ్చిన క్రేజ్ ను మరింత పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. బాహుబలి ది కన్ క్లూజన్ తర్వాత స్టార్ట్ అయిన సాహో సినిమాను తమిళ్,మలయాళం, హిందీల్లోనూ రిలీజ్ చేస్తూ మల్టీలింగ్వల్ గా మార్చేశాడు. 150కోట్ల బడ్జెట్ తో యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈసినిమాను తెరకెక్కిస్తూ, భారీ హిట్ కొట్టాలని ప్లాన్ చేస్తున్నాడు. అందుకే బాలీవుడ్ నుంచి శ్రద్దా కపూర్, నీల్ నితిన్ ముఖేష్ లను దించాడు.
చాలా కాలిక్యులేషన్స్ తో శ్రద్దాను హీరోయిన్ గా తీసుకున్న యంగ్ రెబల్ స్టార్ టీం, నీల్ నితిన్ ముఖేశ్ ను మెయిన్ విలన్ గా సెలక్ట్ చేసుకున్నాడు. వీళ్లతో పాటు బాలీవుడ్ సీనియర్ యాక్టర్ చంకీ పాండేను తీసుకుని సాహోను తెలుగు సినిమా స్థాయి నుంచి బాలీవుడ్ రేంజ్ కు తీసుకెళ్లాడు. ఇప్పుడు ఆ లెవల్ ను మరింత పెంచుతూ ఓ కీరోల్ కు బాలీవుడ్ స్టార్ జాకీ ష్రాఫ్ ను తీసుకుంటున్నారు.
సాహో సినిమాలో కీరోల్స్ అన్నీ బాలీవుడ్ స్టార్లే చేస్తుండడంతో, ఈ మూవీ బాలీవుడ్ సినిమాలాగే బొంబై ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ కనెక్టివీటితో సాహో సినిమాకు అక్కడ భారీ బిజినెస్ జరిగే ఛాన్స్ ఉంటుంది. ఇక జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్ లకు కోలీవుడ్ లోనూ ఫేమ్ ఉంది కాబట్టి, అక్కడ కూడా మంచి మార్కెట్ అవుతుంది. సో బాలీవుడ్ స్టార్లని తీసుకుంటూ సాహో సినిమాతో ప్రభాస్ భారీ వసూళ్ల టార్గెట్ వైపు పరుగులు పెడుతున్నాడని చెప్పొచ్చు.
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!







