ఈ వారంలోనే కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉండవచ్చు అని అధికారక ప్రకటన
- August 22, 2017
► అన్నాడీఎంకేకు 2, జేడీయూకు ఒక కేబినెట్ పదవి
► టీడీపీ నుంచి సీఎం రమేష్, బీజేపీ నుంచి హరిబాబుకు అవకాశం!
► ఆగస్టు 24 లేదా 26న ముహూర్తం!
ఈ వారంలోనే కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరిపేందుకు కసరత్తు కొనసాగుతోంది. జేడీయూ, అన్నాడీఎంకే పార్టీల్లో వివాదాలు కొలిక్కిరావడంతో ఆగస్టు 24 లేదా 26న విస్తరణ ఉండవచ్చని ప్రభుత్వ వర్గాల సమాచారం. జేడీయూ ఇప్పటికే ఎన్డీఏలో చేరగా అన్నాడీఎంకే త్వరలో చేరనుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ రెండు పార్టీలకూ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో స్థానం కల్పించనున్నారని సమాచారం. అందుకోసమే బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా తమిళనాడు పర్యటన రద్దు చేసుకుని ప్రధానితో కలసి మంత్రివర్గ కూర్పుపై తుదిమెరుగులు దిద్దుతున్నారు.
విశ్వసనీయ సమాచారం మేరకు అన్నాడీఎంకేకు రెండు కేబినెట్, రెండు సహాయ మంత్రి పదవులు, జేడీయూకు ఒక కేబినెట్, సహాయమం త్రి పదవి దక్కవచ్చు. 2019లోక్‌సభ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని ఈ విస్తరణ జరుగుతుందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఆశించిన పనితీరు కనపర్చని వారిని మంత్రివర్గం నుంచి తప్పించనున్నట్లు సమాచారం. వయసు పైబడ్డ కల్‌రాజ్ మిశ్రాను తప్పించి బిహార్ గవర్నర్‌గా పంపే అవకాశముంది. ఉత్తరప్రదేశ్, బిహార్‌కు ప్రాధా న్యత తగ్గించి త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక నుంచి కొత్తవారిని మంత్రివర్గంలోకి తీసుకోవచ్చు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







