భారత్ లో రేపటి నుంచి చెలామణీలోకి రూ.200నోటు
- August 24, 2017
శుక్రవారం నుంచి కొత్త రూ.200 నోటు చెలామణీలోకి రానున్నట్లు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది. నవంబరు 8 పెద్ద నోట్ల రద్దు తర్వాత విడుదల కానున్న మూడో నోటు ఇది. కొత్తగా విడుదల కానున్న ఈ నోటు పసుపు రంగులో ఉంది. నోటు వెనుక భాగాన భారతదేశ సంప్రదాయ వారసత్వాన్ని ప్రతిబింబించే విధంగా సాంచీ స్తూపం బొమ్మను ముద్రించారు.
పెద్ద నోట్ల అక్రమ నిల్వలు, వాణిజ్యానికి కళ్లెం వేయడమే లక్ష్యంగా రూ.200 నోట్లను తెరపైకి తీసుకొస్తున్నారు. రూ.100, రూ.500 మధ్య మరో కరెన్సీ నోటు ఇప్పటి వరకూ లేదు. దీంతో రూ.200నోటు మంచి ఆదరణ పొందుతుందని ఆర్బీఐ అంచనా వేస్తోంది. పెద్ద నోట్ల తర్వాత ఎదురవుతున్న చిల్లర సమస్యలను కూడా రూ.200 నోటు కారణంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. అక్రమ నగదు చెలామణీ.. నకిలీ కరెన్సీ నోట్లకు అడ్డుకట్ట వేసేందుకు రూ.200నోటును ముద్రిస్తున్నట్లు గతంలోనే ఆర్బీఐ ప్రకటించింది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







