తీవ్రవాద శిభిరం విచ్ఛిన్నం...... ఏడుగురు అరెస్టు

- August 26, 2017 , by Maagulf
తీవ్రవాద శిభిరం విచ్ఛిన్నం...... ఏడుగురు అరెస్టు

తీవ్రవాద నిరోధక కార్యకలాపాల్లో భాగంగా అధికారులు 10 మంది సభ్యుల గల ఉగ్రవాద శిభిరం విచ్ఛిన్నం చేశారు మరియు తీవ్రవాద చర్యలలో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న ఏడుగురిని ఈ సందర్భంగా అరెస్టు చేశారు. సారా అహ్తార్ తీవ్రవాద బృందానికి నేతృత్వం వహిస్తున్న 31 ఏళ్ల హుస్సేన్ అలీ అహ్మద్ దావూద్ ని అరెస్టు చేశారు.  అల్ వఫా ఇస్లామిక్ ఉద్యమం యొక్క ఉగ్రవాద విభాగం మరియు  ఒక ఫ్యుజిటివ్ అనుబంధంగా ఇరాన్ దేశంలో ఉంది. అరెస్ట్ కాబడిన తీవ్రవాదులలో  హసన్ మాకి అబాస్ హసన్, 27; మహమూద్ మొహమ్మద్ అలీ ముల్లా సేలం అల్ బహ్రని, 33; జైనబ్ మాకి అబాస్, 34; అమీన్ హబీబ్ అలీ జాస్సిమ్, 32; హుస్సేన్ మొహమ్మద్ హుస్సేన్ ఖమీస్, 39; హస్సన్ అతియా మొహమ్మద్ సలే, 37; మరియు హుస్సేన్ ఇబ్రహీం మొహమ్మద్ హసన్ డాహిఫ్, 27. టెర్రర్ శిభిరంలో ఉన్న మరో ఇద్దరు డ్రైవర్లుగా ఉన్న  సభ్యులను అరెస్టు చేయడానికి దర్యాప్తు జరుగుతోంది. వారు: సయీద్ హదీ హసన్ మజీద్ రధీ, 26; మరియు సాదిక్ మొహమ్మద్ అబ్దుల్రాసుల్ దర్వీష్, 25, లకు  అహ్మద్ దావూద్ తో  సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, వీరి జాతీయత రద్దు చేయబడింది మరియు మూడు తీవ్రవాద కేసుల్లో జీవిత ఖైదు విధించబడింది. అధికారులు పేలుడు పదార్ధాలను డీమస్తాన్, కర్జాకన్, మల్కయ్యా మరియు డార్ కులైబ్ గ్రామాల నుంచి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు, వీటి కోసం బాంబులు మరియు దుకాణ సామగ్రిని తయారు చేసేందుకు కార్ఖానాలుగా ఉపయోగించారు. సి జి, టి ఏ టి పి మరియు నైట్రో సెల్యులోస్ 24 కిలోల కంటే ఎక్కువ రసాయనాలతో కూడిన  వాడే బాంబులు, ఆటోమేటిక్ మరియు ఇతర ఆయుధాలు, ఎలక్ట్రానిక్ డిటోనేటర్లతో పాటు,127 కిలోల అధిక-స్థాయి పేలుడు పదార్థాలు మరియు బాంబు తయారీ సామగ్రిని ఈ శిభిరంలో స్వాధీనం చేసుకున్నారు, గ్రెనేడ్లు తయారుచేసేందుకు ఈ మందుగుండు సామగ్రి ద్వారా రూపొందించవచ్చని అధికారులు తెలిపారు. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ మరియు ఫోరెన్సిక్ సైన్స్ జనరల్ డైరెక్టరేట్ చట్టబద్దమైన చర్యలు తరువాత, కేసుని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వద్దకు ప్రస్తావించబడనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com