కగ్జీ కబాబ్
- August 26, 2017
కావలసిన పదార్థాలు:
అల్లం పేస్ట్ - 2 టే.స్పూన్లు
వెల్లుల్లి పేస్ట్ - 2 టే.స్పూన్లు
కారం - 2 టే.స్పూన్లు
పెరుగు - 2 కప్పులు
డబుల్ క్రీమ్ - 1 కప్పు
నిమ్మరసం - పావు కప్పు
చికెన్ డ్రమ్‌స్టిక్స్ - 10
నూనె - 3 టే.స్పూన్లు
నెయ్యి - 2 టేస్పూన్లు
కందిపప్పు - 2 కప్పులు
గరం మసాలా - 100 గ్రా (జీలకర్ర, లవంగాలు, జాజికాయ, జాపత్రి, స్టార్ అనిస్, సోంపు, యాలకులు)
గుడ్లు - 2
ఎర్రని ఫుడ్ కలర్ - 1 టీస్పూను
ఎల్లో ఫుడ్ కలర్ - 1 టీస్పూను
నువ్వులు - 2 టే.స్పూన్లు
పుదీనా - 1 కట్ట
పచ్చిమిర్చి - 10
బంగాళాదుంపలు - 1 కిలో
ఉల్లి కాడలు - 4
అప్పడాలు - 4
ఉల్లిపాయలు - 100 గ్రా
చికెన్ కీమా - అర కిలో
తయారీ విధానం:
కందిపప్పు మెత్తగా ఉడికించి పెట్టుకోవాలి.
చికెన్ డ్రమ్‌స్టిక్స్ శుభ్రం చేసి మధ్యలో ఖాళీ ఏర్పరుచుకోవాలి.
వీటిని గరం మసాలా దినుసులు, రెండు గుడ్లు, పచ్చిమిర్చితో కలిపి 10 నిమిషాలు నానబెట్టాలి.
పాన్‌లో నూనె పోసి కొద్దిగా అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి.
దీనికి చికెన్ కీమా, కందిపప్పు ముద్ద, చేర్చి తాలింపు వేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని చికెన్ డ్రమ్‌స్టిక్‌లో ముందుగా చేసి పెట్టుకున్న ఖాళీల్లో నింపాలి.
అల్లం, వెల్లుల్లి పేస్ట్, కారం, పెరుగు, క్రీమ్, నిమ్మరసంలతో టిక్కా మారినేషన్ తయారు చేసుకుని దీన్లో డ్రమ్‌స్టిక్స్ నానబెట్టాలి.
అర గంట తర్వాత స్వీవర్‌తో గుచ్చి గ్రిల్ మీద ఎర్రగా కాల్చుకోవాలి.
పుదీనా, పచ్చిమిర్చి, అల్లం, నువ్వులతో చట్నీ చేసి పక్కన పెట్టుకోవాలి.
బంగాళాదుంపలు ఉడికించి ఉప్పు చేర్చి మెత్తగా రుబ్బుకోవాలి.
ఒక ప్లేట్‌లో బంగాళాదుంప ముద్ద వేసి మధ్యలో ఖాళీ ఉండేలా పరిచి ఆ ప్రదేశంలో ఉడికించిన పప్పు, నెయ్యి వేయాలి.
దాని మీద రెండు, మూడు చికెన్ డ్రమ్‌స్టిక్స్ ఉంచి పక్కన చట్నీ వేయాలి.
అప్పడాలు చిదిమి చల్లి సర్వ్ చేయాలి.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







