టెక్సాస్ లో ప్రకృతి బీభత్సం
- August 26, 2017
టెక్సాస్: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రాన్ని హార్వే హరికేన్ వణికిస్తోంది. ఈ హరికేన్ కారణంగా గంటకు 215 మైళ్ల వేగంతో పెనుగాలులు వీస్తున్నాయి. దాదాపు 13ఏళ్ల తర్వాత అతిపెద్ద హరికేన్ ఇదే. ఇప్పటికే పలు ప్రాంతాల్లో 42 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భయంకరమైన వరదలు రావచ్చని అంచనా వేస్తున్నారు. దీనిని గాలుల తీవ్రతను కేటగిరి ఒకటికి చెందినవిగా వర్గీకరించారు. ఇప్పటికే పలు భవనాలు కూలిపోయినట్టు తెలుస్తోంది. కూలిన భవనాల్లో ప్రజలు చిక్కుకుపోయారు. విద్యుత్ సరఫరా నిల్చిపోవడంతో దాదాపు రెండు లక్షలమంది ఇబ్బందులు పడుతున్నట్టు సమాచారం.
హరికేన్‌కు దెబ్బతిన్న ప్రాంతాల్లో ప్రభుత్వం సహాయ కార్యక్రమాలు చేపట్టింది. ఈ సందర్భంగా సహాయ బృందాలను అభినందిస్తూ దేశ అధ్యక్షుడు ట్రంప్ ట్వీట్ చేశారు. పలు చోట్ల వరద ప్రమాదం పొంచిఉందని టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబెట్టా ప్రజలను హెచ్చరించారు. రెండు చోట్ల భారీసంఖ్యలో మట్టిపెళ్లలు విరిగిపడ్డాయి. రాక్‌పోర్ట్ ప్రాంతంలో భారీ సంఖ్యలో నివాసగృహాలు దెబ్బతిన్నాయని అన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







