మటన్ దాల్చ
- August 27, 2017
కావలసిన పదార్థాలు: సొరకాయ - అరకేజీ, (లేత) మటన్ - అరకేజీ, శనగపప్పు - 1 కప్పు, టమోటా తరుగు - 2 కప్పులు, ఉల్లి తరుగు - పావు కప్పు, పచ్చిమిర్చి -6, ఉప్పు - రుచికి తగినంత, కారం, పసుపు - అర టీ స్పూను చొప్పున, నూనె - 1 టేబుల్ స్పూను, అల్లం వెల్లుల్లి పేస్టు - 1 టీ స్పూను, కరివేపాకు - 4 రెబ్బలు.
తయారుచేసే విధానం: శనగపప్పులో కొద్దిగా ఉప్పు, పచ్చిమిర్చి వేసి మెత్తగా ఉడికించి, మెదిపి పక్కనుంచాలి. మటన్‌లో తగినంత నీరు పోసి కుక్కర్లో ఉడికించాలి. సొరకాయ క్యూబ్స్‌గా తరిగిపెట్టుకోవాలి. లోతైన కడాయిలో ఉల్లితరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, సొరకాయ ముక్కలు, టమోటా తరుగు, ఉప్పు, పసుపు, కారం ఒకటి తర్వాత ఒకటి వేసి కొద్దిసేపు వేగించాలి. ఉడికించిన మటన్, గ్లాసు నీరు కలిపి ఐదు నిమిషాల తర్వాత పప్పు మిశ్రమం, కరివేపాకు వేసి కొద్దిగా చిక్కబడ్డాక కొత్తిమీర చల్లి దించేయాలి. పలావు అన్నంతో కలుపుకుని తింటే ఎంతో రుచిగా ఉండే కూర ఇది.
తాజా వార్తలు
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్కు మూడు కొత్త బస్సు మార్గాలు
- నన్ను అరెస్ట్ చేయొచ్చు..అయినా వెనక్కి తగ్గం: అభిజీత్ దీప్కే
- ఐదు వారాల్లో తొలిసారి వారాంతపు పతన దిశగా డాలర్







