బ్లూబెర్రీస్, ఆవకాడో, కోడిగుడ్లు తింటే.. మతిమరుపుకు చెక్

- August 27, 2017 , by Maagulf
బ్లూబెర్రీస్, ఆవకాడో, కోడిగుడ్లు తింటే.. మతిమరుపుకు చెక్

వకాడో, కోడిగుడ్లు, ఆకుకూరలను ఎక్కువగా తీసుకుంటే మెదడు చురుగ్గా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మతిమరుపును దూరం చేసుకోవాలన్నా.. మెదడు పనితీరును మెరుగుపరుచుకోవాలన్నా.. డైట్‌లో తప్పకుండా ఆకుకూరలను రోజు అరకప్పైనా చేర్చుకోవాలని వారు సూచిస్తున్నారు. వయసు పెరిగే కొద్దీ మెదడు చురుకుదనం తగ్గిపోతుంది. అలాంటప్పుడు ఆలోచనా శక్తి, తెలివితేటలు కూడా తగ్గిపోతుంటాయి. 
మతిమరుపు సమస్యలు ఉత్పన్నం కాకముందే వాటిని జరగకుండా ఉండేలా ల్యూటెన్ సమృద్ధిగా ఉండే ఆకుకూరలు, ఆవకాడో, కోడిగుడ్లు వంటివి ఎక్కువగా తీసుకుంటే మెదడూ శరీరమూ రెండూ చురుగ్గా పనిచేస్తాయని వైద్యులు తెలిపారు. ఈ విషయం ఇప్పటికే పలు పరిశోధనల్లోనూ వెల్లడి అయ్యిందని.. వైద్యులు చెప్తున్నారు. ఆకుకూరల్లోని ల్యూటెన్‌ జ్ఞాపకశక్తినీ పెంపొందిస్తుందని వారు సూచిస్తున్నారు.
అలాగే బ్లూ బెర్రీస్‌లో ఫ్లెవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. మతిమరుపు కలగకుండా అడ్డుకునే ఫోటోకెమికల్స్ వీటిలో ఉంటాయి. ఆకుకూరలు, ఆవకాడో, కోడిగుడ్లతో పాటు క్యాలీఫ్లవర్, మొలకెత్తిన విత్తనాలు, ఆరెంజ్, ద్రాక్ష పండ్లు తీసుకోవడం మంచిది. మెదడుకు రక్తప్రసరణ సరిగ్గా జరగాలంటే, జ్ఞాపకశక్తి పెరగాలంటే.. తాజా పండ్లు, కాయగూరలు తీసుకోవాలి. 
అంతేగాకుండా సాల్మన్ ఫిష్‌లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. మెదడును యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా మార్చడంలో ఉపయోగపడతాయి. మానసిక ఆందోళనను దూరం చేస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com