లంక పై భారత్‌ ఘనవిజయం..

- August 27, 2017 , by Maagulf
లంక పై భారత్‌ ఘనవిజయం..

బాలగోళ్ల: భారత్‌-శ్రీలంక మధ్య జరిగిన మూడో వన్డేలో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో 5 వన్డేల సిరీస్‌లో భారత్‌ మూడు నెగ్గడంతో సిరీస్‌ కైవసమైంది. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ అజేయ శతకానికి మహేంద్రుడి అర్ధ శతకం తోడవ్వడంతో భారత్‌ విజయం సులువైంది.
లంక అభిమానుల ఆగ్రహాం...
44 ఓవర్లకు భారత్‌ 210 పరుగులు చేసి విజయానికి 8 పరుగుల దూరంలో ఉండగా.. భారత విజయాన్ని తట్టుకోలేని లంక అభిమానులు ఆగ్రహాంతో మైదానంలోని ఫీల్డర్లపై పెద్ద ఎత్తున బాటిళ్లు విసిరారు. దీంతో మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపేసిన అంపైర్లు.. కొద్దీ సేపటి అనంతరం మ్యాచ్‌ను పునప్రారంభించారు. మరో 7 బంతులు ఆడిన భారత్‌ లక్ష్యాన్ని చేదించింది.  
 
అంతకు ముందు లంక  నిర్దేశించిన 218 పరుగుల స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన టీమిండియా టపార్డర్ బ్యామ్స్ మెన్ తడబడటంతో రెండో వన్డే పరిస్థితి మరోసారి కనిపించింది. అయితే ఓపెనర్ రోహిత్ శర్మ(122  నాటౌట్‌), మహేంద్రసింగ్‌ ధోని(61 నాటౌట్‌)లు రాణించడంతో భారత్‌ సునాయసంగా గెలుపొందింది. ఇక భారత్‌ టాపార్డర్‌ బ్యాట్స్‌మెన్‌లలో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌(5) ఆదిలోనే అవుటై తీవ్రంగా నిరాశపరచగా కెప్టెన్‌ కోహ్ల్లీ(3), లోకేష్‌ రాహుల్‌(17), కేదార్‌ జాదవ్‌(0)లు మరోసారి విఫలమయ్యారు. లంక బౌలర్లలో అఖిల ధనంజయకు 2 వికెట్లు దక్కగా, లసిత్‌ మలింగా, ఫెర్నాండోలకు చెరో వికెట్‌ దక్కింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com