పది నెలలుగా కోమాలో ఉన్న బాలీవుడ్ నటుడు నిర్మాత నీరజ్ వోరా
- August 27, 2017
బాలీవుడ్ నటుడు, నిర్మాత నీరజ్ వోరా పది నెలలుగా కోమాలో ఉన్నారట. 2016 అక్టోబర్‌లో ఆయనకు గుండెపోటు వచ్చింది. దాంతో ఆయన్ని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చేరిన మరుసటి రోజే బ్రెయిన్ స్ట్రోక్ తగిలింది.
దాంతో ఆయన కోమాలోకి వెళ్లిపోయారు. ఆయన త్వరగా కోలుకోవాలని నీరజ్ స్నేహితుడు ఫెరోజ్ ఇంట్లో ఓ గదిని ఐసీయూగా మార్చి అందులోనే చికిత్స చేయిస్తున్నట్లు నీరజ్ కుటుంబీకులు తెలిపారు. హిందీలో 'హెరాఫెరీ', 'చాచి 420' చిత్రాలకు నీరజ్ దర్శకత్వం వహించారు. ఇప్పుడిప్పుడే ఆయనలో కదలికలు వస్తున్నాయని పేర్కొన్నారు. నీరజ్ దర్శకత్వం వహిస్తున్న 'హెరాఫెరీ 3' సినిమా చిత్రీకరణ తాత్కాలికంగా నిలిచిపోయినట్లు చెప్పారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







