ఘంటశాల మానవరాలిని ప్రేమించి మనుమాడ బోతున్న క్షణం డైరెక్టర్
- August 27, 2017
అమర గాయకుడు ఘంటశాల వెంకటేశ్వరరావు మనవరాలు వీణ, చిన్న సినిమాతో పెద్ద సక్సెస్ అందుకొన్న క్షణం మూవీ దర్శకుడు రవికాంత్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు.. వీణ, రవికాంత్ ల నిశ్చితార్ధం ఆగష్ట్ 12 న ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య చెన్నైలో జరిగింది. వీణ ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్టు.. నటుడు ఘంటశాల రత్న కుమార్ కుమార్తె..!! అంటే టాలీవుడ్ లో మరో జంట ప్రేమించి త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నది అన్నమాట.
2016 లో రిలీజైన క్షణం సినిమా తో మంచి దర్శకుడు గా రవికాంత్ పెరెపు కి పేరు వచ్చింది. కాగా ఆ క్షణం సినిమా తో దర్శకుడు రవికాంత్ మంచి పేరు తో పాటు.. మంచి జీవిత పార్ట్ నర్ ని కూడా దక్కించుకొన్నాడు.. క్షణం లో హీరోయిన్ గా నటించిన అదా శర్మా పాత్రకు ఘంటశాల వీణ డబ్బింగ్ చెప్పారు.. ఆ సమయంలో వీణని చూసిన రవికాంత్... ప్రేమ పాటను ఎత్తుకొన్నాడు.. తొలి చూపులోనే మనసు పడేసుకొన్న రవి అప్పటి నుంచి వీణ తో టచ్ లో ఉన్నాడు.. అలా మొదలైన వీరి స్నేహం రెండు ఏళ్ళు కొనసాగింది.. కాగా రవి ఓ రోజు తన ప్రేమ విషయం వీణ ముందు పెట్టాడు. నేను నిన్ను తొలిచూపులోనే ఇష్టపడ్డాను.. ప్రేమిస్తున్నాను.. నీవు అంగీకరిస్తే పెళ్లి చేసుకోవాలని అనుకొంటున్నాను అని రవి కాంత్ తన మనసులోని మాటను వీణ ముందు చిలకలా పలికాడు.. రవికాంత్ ప్రేమని వీణ మొదట రిజెక్ట్ చేసింది.. కానీ కొన్ని రోజులకే రవికాంత్ ప్రేమ లోని సిన్సియారిటీ తెలిసి.. పెళ్లి చేసుకోవడానికి అంగీకరించింది. ఇరు కుటుంబ సభ్యులు వీరి ప్రేమకు ఆమోద ముద్ర వేసి.. నిశ్చితార్ధం జరిపించారు.. చెన్నై లో నవంబర్ 11 న వీణ, రవికాంత్ ల పెళ్లి జరగనున్నది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







