మరో కొత్త ఫీచర్‌తో రాబోతున్న వాట్సాప్
- August 28, 2017
ప్రముఖ మెసెంజర్ యాప్ వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ రాబోతోంది. ఇప్పటి వరకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్‌కు మాత్రమే పరిమితమైన వెరిఫైడ్ అకౌంట్స్ సౌలభ్యం ఇకపై వాట్సాప్‌లోనూ లభ్యం కానుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ బీటా దశలో ఉంది. త్వరలో యూజర్లకు అందుబాటులోకి రానుంది.
బిజినెస్ ప్రొఫైల్స్‌కు ఈ సౌలభ్యం కల్పించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఇప్పటికే కొన్ని బిజినెస్ అకౌంట్లను తనిఖీ చేశామని వాట్సాప్ వెల్లడించింది. తనిఖీ చేసిన ఖాతాలకు పేరు తర్వాత ఇకపై ఆకుపచ్చ బ్యాడ్జ్‌తో పాటు, తెలుపు రంగు టిక్‌మార్కు ఉంటుందని పేర్కొంది. సంబంధిత ప్రొఫైల్ అప్పటికే మీ ఫోన్‌బుక్‌లో ఉంటే అదే పేరుతో ఫోన్లో దర్శనమిస్తుందని, ఒకవేళ ఆ కాంటాక్ట్ లేకపోతే సంబంధిత ఖాతా అసలు పేరు ప్రత్యక్షమవుతుందని తెలిపింది. వీటిని ఇతర ఖాతాల మాదిరిగానే బ్లాక్ చేసే సౌలభ్యం కూడా ఉందని కంపెనీ పేర్కొంది.
బిజినెస్ ఖాతాకు సంబంధించిన పూర్తి వివరాలు అంటే.. పూర్తి చిరునామా, ఈ-మెయిల్, వెబ్సైట్ వంటి వివరాలు అందులో దర్శనమిస్తాయి. ఒక వేళ సంబంధిత ఖాతా ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఉంటే అక్కడ ఆ లింకు కూడా కనిపిస్తుంది.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







