బహ్రెయిన్ లో ప్రవాసీయ కార్మికుడు మృతి
- August 28, 2017
మనామా : రెండు రోజుల వ్యవధిలో మరో ఆసియా ప్రవాసీయుడు శనివారం రఫ్ఫాలోని తన నివాసంలో చనిపోయాడు.హారవిందర్ సింగ్ గా గుర్తించబడిన ఈ వ్యక్తి ఆటోమొబైల్ మెకానిక్ గా అల్ మోయిడ్ మోటార్స్ కో లో పనిచేస్తున్నాడు. బహ్రెయిన్ రాజ్యంలో తన సోదరుడితో పాటు కల్సి రఫ్ఫాలో నివసిస్తూ ఉండేవారు. తెల్లవారుజామున హారవిందర్ సింగ్ స్నాలగదిలో చనిపోయి ఉండటాన్ని కనుగొన్నారు. ఆ పరిస్థితిలో ఆయనను చూసిన మేము ఆసుపత్రి సిబ్బందిని వెంటనే పిలిచాము. పారామెడికల్ బృందం అక్కడకు చేరుకొని అప్పటికే ఆయన మరణించినట్లు ధ్రువీకరించారని స్థానిక నివాసి ఒకరు చెప్పారు. హారవిందర్ సింగ్ మరణానికి కారణం తెలియదు. చట్టపరమైన లాంఛనప్రాయాలను పూర్తి చేసిన వెంటనే ఆయన భౌతిక కాయాన్ని స్వదేశానికి పంపబడుతుందని అధికారులు చెప్పారు. రెండు రోజుల క్రితం మాలిక్యా లో నిర్మాణ సంస్థ లో వడ్రంగిగా పనిచేస్తున్న ఒక ఆసియా కార్మికుడు బుద రామ్ విషాదంగా మరణించిన విషయం మరవక ముందే మరొక ప్రవాస భారతీయుడు చనిపోవడంతో ప్రవాసీయులు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!







