బాదామి హరియాలి
- August 29, 2017కావలసిన పదార్థాలు: ఉల్లికాడలు - 5, పచ్చిమిర్చి - 4, బాదం తరగు - అరకప్పు, అల్లం తరుగు - 2 టీ స్పూన్లు, కొత్తిమీర తరుగు - ముప్పావు కప్పు, మెంతి ఆకులు - అరకప్పు, ఉడికించిన బీన్స్ - 1 కప్పు, పచ్చిబఠాణి - 1 కప్పు, తాజా క్రీమ్ - 2 టేబుల్ స్పూన్లు, పంచదార - 2 టీ స్పూన్లు, జీలకర్ర పొడి - 1 టీ స్పూను, బిర్యాని ఆకు - 1, నూనె - 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత, పనీర్ తురుము - అలంకరణకు.
తయారుచేసే విధానం: బాదం తరుగుతో పాటు ఉల్లి కాడలు (తెల్లని భాగం మాత్రమే), కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం తరుగు మిక్సీలో వేసి కొద్దిగా నీరు పోసి మెత్తగా రుబ్బుకోవాలి. నూనెలో బిర్యాని ఆకుతో పాటు బాదం పేస్టు వేసి పచ్చివాసన పోయేవరకు చిన్నమంటపై వేగించాలి. ఇప్పుడు మెంతి ఆకులు, పచ్చిబఠాణి, ఉప్పు, పంచదార, జీలకర్ర పొడి కలిపి 8 నిమిషాల ఉంచాలి. తర్వాత ఉడికించిన బీన్స్, క్రీమ్ వేసి 3 నిమిషాలు తర్వాత పనీర్ తురుము చల్లి దించెయ్యాలి. నాన్, పరాటాలతో కలిపి తింటే రుచిగా ఉంటుంది.
తాజా వార్తలు
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!