అల్సర్ వుంటే అల్లం తినొద్దు
- August 29, 2017
వైద్యుల సలహా లేకుండా అల్సర్‌తో బాధపడేవారు అల్లం ఎక్కువగా తీసుకోకూడదని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అల్లంతో చేసే పదార్థాలన్నీ కాస్త కారంతో కూడిన రుచిని ఇస్తాయి. అందుచేత అల్లం, శొంఠి వంటివి అల్సర్ ఉన్న వారు రోజువారీగా ఉపయోగించకూడదు. వైద్యుల సలహా మేరకే అల్లాన్ని మోతాదుకు మించకుండా తీసుకోవాలి.
అల్సర్ వున్న వారు పరగడుపున అల్లంతో చేసిన వంటకాలను, అల్లంతో చేసిన మందులను తీసుకోకూడదు. అలా చేస్తే ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. ఆహారం తీసుకున్నాకే అల్లంతో చేసిన వంటకాలను, మందులను తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.
ఇక అల్లం పిత్త సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. ఆకలి లేమిని నయం చేస్తుంది. వేవిళ్లు, కడుపు ఉబ్బరం, శ్వాసకోశ సమస్యలను అల్లం నయం చేస్తుంది. వికారం, వాంతులు తగ్గించడంలో అల్లం భేష్‌గా పనిచేస్తుంది. ముఖ్యంగా గర్భిణీ మహిళల్లో వేవిళ్లు తగ్గాలంటే.. అల్లాన్ని రెగ్యులర్‌గా తీసుకోవాలి. ఇంకా గొంతు నొప్పికి అల్లం దివ్యౌషధంగా పనిచేస్తుంది.
గొంతు నొప్పితో ఇబ్బంది పడుతుంటే, అల్లం ముక్క తీసుకుని, అందులో నీళ్ళలో వేసి బాగా మరిగించాలి. తర్వాత అందులో ఒక స్పూన్ తేనె, నిమ్మరసం మిక్స్ చేసి తీసుకోవాలి. దీన్ని రోజూ తీసుకోవడం వల్ల గొంతు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్‌లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







