హీరో వెంకటేష్, హీరో విజయ్ దేవర కొండ క్రేజీ మల్టీస్టారర్ మూవీ రెడీ
- August 31, 2017
టాలీవుడ్ లో ఓ క్రేజీ మల్టీస్టారర్ రెడీ అవుతోంది. ఎవ్వరూ ఊహించని కాంబినేషన్ లో సూపర్ సినిమా రూపొందనున్నది. ఫ్యామిలీ ఆడియన్స్ లో ఫుల్ ఫాలోయింగ్ ఉన్న సీనియర్ హీరో, యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న రైజింగ్ స్టార్ ఇద్దరూ కలిసి సినిమా చెయ్యబోతున్నారు. ఇంతకీ మల్టీస్టారర్ లో నటించబోతోన్న ఆఫ్యామిలీ హీరో, యూత్ స్టార్ ఎవరో వివరాల్లోకి వెళ్తే...
వెంకటేశ్-విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో మల్టీస్టారర్ మూవీ రాబోతోంది. అర్జున్ రెడ్డితో కొంచెం అగ్రెసివ్ గా కనిపించిన విజయ్ దేవరకొండ, మిస్టర్ కూల్ గా కనిపించే విక్టరీ వెంకటేశ్ తో కలిసి సినిమా చెయ్యబోతున్నాడు. చాలా కాంట్రాస్ట్ ఇమేజ్ ఉన్న ఈ ఇద్దరు హీరోలు కలిసి సినిమా చేయబోతున్నారంటే ఆసక్తి కలగక మానదు.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గోపాలా గోపాలా సినిమాలతో మల్టీస్టారర్ ట్రెండ్ ను పీక్స్ కు తీసుకెళ్లిన వెంకీ, ఇప్పుడు రాక్ లైన్ వెంకటేశ్ నిర్మాణంలో విజయ్ దేవరకొండతో కలిసి సినిమా చెయ్యడానికి కమిట్ అయ్యాడట. భాస్కర్ దర్శకత్వంలో ఈసినిమా రాబోతోందట. రాక్ లైన్ కొంత గ్యాప్ తర్వాత తెలుగులో సినిమా నిర్మిస్తుండడంతో ఈమూవీపై ఎక్స్ పెక్టేషన్స్ పెరుగుతున్నాయి. విక్రమ్ వేద రీమేక్ గానే వస్తోందా? లేక కొత్తకథతో ఈ మల్టీస్టారర్ తెరకెక్కబోతోందా? అనేది కొంచెం సస్పెన్స్ గా మిగిలింది. అయితే వీళ్లిద్దరు కలిసి సినిమా చేస్తే మాత్రం ఆ మూవీ సమ్ థింగ్ స్పెషల్ గా ఉంటుందని చెప్పొచ్చు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







