అమెరికాలోహరికేన్ హార్వే తుఫాను వల్ల ప్రవాస భారతీయుల ఆకలి కేకలు
- August 31, 2017
అమెరికాలో ప్రవాస భారతీయుల ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. ఒక్కపూట కడుపు నింపే అన్నదాత కోసం వారు ఎదురు చూస్తున్నారు. దీనికి కారణం హరికేన్ హార్వే తుఫాను. ఈ తుఫాను ధాటికి అమెరికా అతలాకుతలమైన విషయం తెల్సిందే. ముఖ్యంగా ఈ హూస్టన్ నగరాన్ని హరికేన్ నామరూపాలు లేకుండా చేసింది. ఈ హరికేన్‌లో చిక్కుకుని తెలుగు కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి.
వందలాది ఇళ్లు నీట మునిగాయి. రవాణా వ్యవస్థ స్తంభించింది. మరోవైపు ఆహారం దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. హూస్టన్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు రెండు లక్షల మంది ప్రవాస భారతీయులు నివసిస్తుండగా వారిలో తెలుగువారే ఎక్కువ. తుఫాను కారణంగా హూస్టన్ అతలాకుతలమవడంతో ఏమీ దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో ఆకలి బాధలు తప్పడం లేదు.
నిరాశ్రయులను ఆదుకునేందుకు ముందుకొచ్చిన ప్రవాస భారతీయులు ఎక్కడికక్కడ ఆలయాలు, మసీదులు, గురుద్వారాలు, విద్యాసంస్థల్లో శిబిరాలు ఏర్పాటు చేశారు. అలాగే సురక్షితంగా ఉన్న ఒక్కో కుటుంబమూ మరో రెండుమూడు కుటుంబాలకు ఆశ్రయం ఇచ్చింది.
సోషల్ మీడియా ద్వారా అన్నార్తులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు అక్కడి ప్రవాస భారతీయ హోటళ్లు ముందుకొచ్చాయి. ఒక్కో హోటల్ రెండువేల మందికి ఆహారాన్ని సరఫరా చేస్తోంది. వరదల కారణంగా అమెరికాలో చమురు ధరలు అమాంతం పెరిగిపోయాయి. గ్యాలన్ పెట్రోలు ధర ఏకంగా రెండేళ్ల గరిష్టానికి చేరింది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







