రియల్ హీరో అనిపించుకున్న లియోనార్డో డికాప్రియో
- August 31, 2017
ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి కాస్త స్పందించే మనస్సు, మరికాస్త మానవత్వం ఉంటే చాలు, బంధాలు, బంధుత్వాలు ఉండక్కర్లేదు. తెరమీద నటించి ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేస్తారు హీరో హీరోయిన్లు. బోలెడంత మంది అభిమానుల్ని కూడా సంపాదించేసుకుంటారు. తెర మీదే కాకుండా తెరవెనుక కూడా అలానే నిజమైన హీరోలా ఉండాలని ఒకింత చిన్న ఆశ కూడా ఉంటుంది ప్రేక్షకమహాశయులకి. కానీ అందరూ ఆ కోవకి చెందరు. సినిమాల్ని నిజజీవితాలకి ముడిపెట్టరు. కొందర్ని మాత్రమే వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. ఏదైనా ఆపద వచ్చినప్పుడు వెంటనే స్పందించే హృదయం ఆ కొందరికే ఉంటుంది.
ఆ కొందరిలో ఒకరు హాలివుడ్ 'టైటానిక్' హీరో లియోనార్డో డికాప్రియో కూడా. గత కొద్దిరోజులుగా అమెరికా ప్రజలను వణికిస్తున్న హరికేన్ హార్వేకి వేలాది మంది ప్రజలు సర్వం కోల్పోయి ఆదుకునేవారికోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. వారిని చూసి చలించి పోయిన హాలీవుడ్ తారలు ఆదుకునేందుకు తమ వంతు సహాయం చేస్తున్నారు. ఇలా సహాయం చేసే వారిలో ముందున్నది మాత్రం హీరో లియోనార్డో డికాప్రియో. తను ఇంతకు ముందే స్థాపించిన డికాప్రియో ఫౌండేషన్ నుంచి 1 మిలియన్ డాలర్లు (మన ఇండియన్ కరెన్సీలో రూ.6.30 కోట్లు) ఆర్థిక సహకారం అందించినట్లు ఆ సంస్థ సీఈవో టెర్రీ టమ్మినెన్ తెలిపారు. లియోనార్డో గొప్ప మనస్సుతో వెంటనే స్పందించిన తీరుకి ధన్యవాదాలని యునైటెడ్ వే హార్వే రికవరీ ఫండ్ సీఈవో బ్రెయిన్ గల్లఘెర్ తెలిపారు. 2004 లో వచ్చిన సునామీ బాధితులను కూడా డికాప్రియో సంస్ధ ఆదుకుంది. ఉత్తమ నటిగా ఆస్కార్ అందుకున్న కథానాయిక శాండ్రా బుల్లక్ కూడా హార్వే బాధితుల సహాయార్థం 1 మిలియన్ డాలర్ ఆర్థిక సహకారం అందించింది. వీరితో పాటు మరికొంత మంది బాలీవుడ్ తారలు తమ వంతుగా విరాళాలందించి అండగా నిలవడం అభినందించదగ్గ విషయం.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







