'పైసా వసూల్' చిత్రం చూస్తూ అభిమానులతో సందడి చేసిన బాలయ్య
- August 31, 2017
ఈ మద్య ఒక సినిమా రిలీజ్ కావడానికి ముందు నుంచి ఆ సినిమాపై విపరీతమై అంచనాలు పెంచుతున్నారు చిత్ర యూనిట్. ఇందుకోసం డైరెక్టర్,హీరో, హీరోయిన్లు కూడా ప్రమోషన్ వర్క్ లో తమదైన స్టైల్ చూపిస్తున్నారు. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ లో ఈ మద్య కాలంలో సినిమా ప్రమోషన్స్ కోసం వివిధ చానల్స్ లో చిట్ చాట్ చేస్తూ సినిమా షూటింగ్ విశేషాలు..అభిప్రాయాలు చెబుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నారు.
తాజాగా పూరిజగన్నాథ్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ, శ్రియ జంటగా నటించిన 'పైసా వసూల్' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. ఈ చిత్రంపై మొదటి నుంచి విపరీతమైన అంచనాలు పెంచుతూ వచ్చారు..ఖమ్మంలో ఆడియో రిలీజ్..ఫ్రీరిలీజ్ ఫంక్షన్ రోజు బాలయ్య చేసిన సందడి అంతా ఇంతా కాదు.
ఈ రోజు 'పైసా వసూల్' ప్రేక్షకుల ముందుకు వచ్చిన నేపథ్యంలో హైదరాబాద్ కూకట్‌పల్లిలో నటసింహం నందమూరి బాలకృష్ణ సందడి చేశారు. బాలయ్య భ్రమరాంబ థియేటర్‌లో సినిమా చూసేందుకు వచ్చాడు. డాషింగ్ డైరెక్టర్ పూరీ, ఛార్మితో పాటు అభిమానుల సమక్షంలో మూవీని తిలకించారు.
తమ అభిమాన హీరో బాలయ్య సినిమా చూడటానికి వచ్చాడని తెలుసుకున్న బాలయ్య ఫ్యాన్స్ అక్కడ తెగ హల్ చల్ చేశారు. థియేటర్ దగ్గర కనిపించడంతో అభిమానులు ఉత్సాహాంగా కేరింతలు, ఈలలు వేసి గోల గోల చేశారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







