మాస్క్‌లో దొంగతనం: శిక్ష తగ్గింపు
- September 01, 2017
హై క్రిమినల్ కోర్ట్, మాస్క్‌లో దొంగతనం చేస్తూ పట్టుబడ్డ వ్యక్తికి ఆరు నెలల నుంచి మూడు నెలలకు జైలు శిక్షను తగ్గించింది. బుడైయాలోని అనాస్ ఇబ్న్ మాలిక్ మాస్క్‌లో డొనేషన్స్ కాజేసిన కేసులో దోషిగా తేలాడు ఓ వ్యక్తి. మాస్క్ నుంచి మెటల్ డొనేషన్ బాక్స్ గల్లంతయినట్లుగా బుడైయా పోలీస్ స్టేషన్లో ఇమామ్ ఫిర్యాదు చేయడం జరిగింది. బాక్స్‌లో 150 బహ్రెయినీ దినార్స్ ఉన్నట్లు ఇమామ్ ఫిర్యాదు చేశారు. మాస్క్ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించిన పోలీసులు, ఇద్దరు వ్యక్తుల్ని నిందితులుగా గుర్తించారు. బహ్రెయిన్ డిఫెన్స్ ఫోర్స్‌కి చెందిన వ్యక్తి ఓ నిందితుడు కావడంతో అతన్ని మిలిటరీ కోర్టుకు అప్పగించారు. రెండో నిందితుడు, తన స్నేహితుడు మెటల్ బాక్స్‌తో తన వద్దకు వచ్చాడని, కాంక్రీట్ బ్లాక్‌తో దాన్ని బద్దలుగొట్టి, అందులోని 45 బహ్రెయినీ దినార్స్‌ని తీశాడని విచారణలో అంగీకరించాడు. ఫస్ట్ హై క్రిమినల్ కోర్టు ఈ కేసులో ఆరు నెలల జైలు శిక్షను రెండో నిందితుడికి విధించింది. అయితే ఆ రెండో నిండితుడు, అపీల్ కోర్టులో ఆ శిక్షను తగ్గించాల్సిందిగా కోరడంతో 3 నెలల జైలు శిక్షను ఖరారు చేసింది న్యాయస్థానం.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







