బ్లూ వేల్ ఛాలెంజ్ గేమ్ అడ్మిన్ అరెస్ట్
- September 01, 2017
బ్లూ వేల్ ఛాలెంజ్ గేమ్ సూత్రధారిగా భావిస్తున్న రష్యా యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు. బ్లూవేల్ ఆడేవారు ఆత్మహత్య చేసుకునేలా పురిగొల్పుతున్న యువతిగా ఆమెను గుర్తించినట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా ప్రపంచ వ్యాప్తంగా 130 మంది బ్లూ వేల్ ద్వారా ఆత్మహత్య చేసుకున్నారు. ఈ గేమ్‌లో నిర్దేశించిన టాస్క్‌ను పూర్తి చేయకపోతే చంపేస్తానని.. వారి కుటుంబ సభ్యుల్ని హతమారుస్తానని ఆ యువతి బాధితులను బెదిరించినట్లు అభియోగాలున్నాయి.
ఎవరైతే నిరాశా నిస్పృహలతో కుంగుబాటుకు గురౌవుతారో.. వారిని బ్లూవేల్ ఛాలెంజ్ లక్ష్యంగా తీసుకుంటుంది. ఇలా ఈ గేమ్ లక్ష్యాన్ని చేరుకోలేక 130 మందికిపైగా ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇప్పటికే బ్లూవేల్‌ను కనిపెట్టిన రష్యన్ సైకాలజీ విద్యార్థి ఫిలిప్ బుడెకిన్‌కు మూడేళ్ళ జైలు శిక్ష విధించారు. తాజాగా బ్లూవేల్ ఆడేవారు రష్యా యువతి ఇంటిపై పోలీసులు దాడి చేయగా ఫిలిప్ ఫోటో అక్కడ కనిపించింది.
తొలుత ఈ ఆట ఆడిన ఆ యువతి తన ప్రాణాలు తీసుకునే టాస్క్‌ను పూర్తి చేయలేదు. దానికి బదులుగా, ఆ ఆట సైట్‌కు అడ్మినిస్ట్రేటర్‌గా మారి.. టాస్క్ పూర్తికాని వారిని ఆత్మహత్యకు పాల్పడేలా పురిగొల్పిందని పోలీసులు అంటున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







