కేంద్ర కేబినెట్ నుంచి దత్తాత్రేయకు ఇక పై సెలవు
- September 01, 2017
కేంద్ర కేబినెట్ నుంచి బండారు దత్తాత్రేయకు ఉద్వాసన పలికారు. బీజేపీ అధిష్టానం ఆయనకు గవర్నర్ పదవి ఇస్తామని హామీ ఇచ్చింది. తాజా పరిణామాలను చూస్తే మొదట 8 మంది కేంద్రమంత్రులకు ఉద్వాసన పలికే అవకాశం ఉందని నిన్న వచ్చిన సమాచారం. అయితే శుక్రవారం జరిగిన పలు పరిణామాలను చూస్తే.. 8 మందికంటే ఎక్కువమందికి ఉద్వాసన పలికే అవకాశమున్నట్లు సమాచారం. ఇవాళ మంత్రులు ప్రధాని మోదీకి కలిసి తమ రాజీనామాలను అందజేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల మంత్రులు నిర్మలా సీతారామన్, బండారు దత్తాత్రేయలు తమ రాజీనామా లేఖలను మోదీకి అందజేశారు.
అయితే నిర్మలా సీతారామన్‌ను పార్టీకి మీడియా తరఫున ఛీప్‌గా నియమించాలని అధిష్టానం భావిస్తున్నట్లుగా తెలియవచ్చింది. అలాగే దత్తాత్రేయకు గవర్నర్ పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. కొత్త మంత్రి వర్గం 2019 ఎన్నికల కేబినెట్‌గానే చర్చించబోతున్నట్లుగా తెలియవచ్చింది. కేంద్రకేబినెట్ విస్తరణ ఆదివారం ఉదయం జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!







