కార్లలో దొంగతనాలు: ఇద్దరి అరెస్ట్
- September 01, 2017
పార్క్ చేసి ఉన్న కార్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. ముహరాక్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, అరెస్ట్ అయిన నిందితులు పార్క్ చేసిన వాహనాల్లో విలువైన వస్తువుల్ని తస్కరిస్తూ ఉండేవారు. పలు ఫిర్యాదుల నేపథ్యంలో పోలీసులు అలెర్ట్ అయ్యారు. దొంగతనాలు జరిగిన ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించి, నిందితుల్ని గుర్తించగలిగారు. ముహరాక్ సహా కింగ్‌డమ్‌లోని పలు ప్రాంతాల్లో ఈ తరహా దొంగతనాలకు పాల్పడినట్లు నిందితులు విచారణలో అంగీకరించారు. దొంగతనం చేయడానికి కార్ల అద్దాల్ని పగలగొట్టేవాళ్ళమని నిందితులు తెలిపారు. నిందితుల నుంచి దొంగతనాలకు ఉపయోగించే పనిముట్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







