ఐదు క్యాంప్‌ల ఏర్పాటు: ఇండియన్ ఎంబసీ
- September 01, 2017
కాన్సులర్ సేవల్ని అత్యవసరంగా అందించేందుకోసం ఖతార్‌లో ఇండియన్ ఎంబసీ భారతీయ వలసదారులకు ఉపయోగకరంగా ఉండేందుకు ఐదు క్యాంప్‌లను ఆగస్ట్‌లో నిర్వహించింది. సల్వా, మెసైయీద్, అల్ ఖోర్, దుఖాన్, జిక్రీత్ తదితర ప్రాంతాల్లో వీటిని నిర్వహించినట్లు నెలవారీ నిర్వహించే కమ్యూనిటీ హౌస్ సందర్భంగా అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా మొత్తం 219 కాన్సులర్ సర్వీసుల్ని ఐదు క్యాంప్‌ల ద్వారా అందించినట్లు తెలిపారు అధికారులు. వలసదారులకు సంబంధించి పలు సమస్యలకు ఈ క్యాంప్‌లలో పరిష్కారం చూపగలిగినట్లు వారు వివరించారు. ఇంకో వైపున ఇండియన్ ఎంబసీ టీమ్, డిపోర్టేషన్ సెంటర్‌నీ, అలాగే సెంట్రల్ ప్రిజన్నీ సందర్శించింది. అక్కడి భారతీయ వలసదారుల సమస్యల్ని ఎంబసీ అధికారులు అడిగి తెలుసుకున్నారు. జనవరి నుంచి 2017 మొత్తం 8 కమ్యూనిటీ హౌస్ సెషన్స్ నిర్వహించారు. మొత్తం 42 ఫిర్యాదులు ఈ సెషన్స్‌లో అందాయి. వీటిల్లో 28 ఫిర్యాదులకు పరిష్కారం దొరికింది. 14 ఫిర్యాదులు యాక్టివ్ ఫాలో అప్‌లో ఉన్నాయి. ఎంబసీ 43 ఎమర్జన్సీ సర్టిఫికెట్లను ఆగస్ట్‌లో జారీ చేసింది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







