గల్ఫ్ వలసకార్మికుల కోసం డిల్లీలో 'ఓపెన్ హౌజ్'

- September 01, 2017 , by Maagulf
గల్ఫ్ వలసకార్మికుల కోసం డిల్లీలో 'ఓపెన్ హౌజ్'

* 6న ఢిల్లీలో ప్రవాసీల కోసం ప్రజావాణి  

* ప్రతినెల మొదటి బుధవారం డిల్లీలో 'ప్రవాసి ప్రజావాణి' 

18 ఇసిఆర్ దేశాలకు ఉద్యోగానికి వలస వెల్లదలచినవారు, ఆయాదేశాల నుండి వాపస్ వచ్చినవారి సమస్యలను వినడానికి ప్రతినెల మొదటి బుధవారం డిల్లీలోని చాణక్యపురి, అక్బర్ భవన్ లో విదేశాంగ శాఖ, ప్రొటెక్టర్ జనరల్ ఆఫ్ ఎమిగ్రెంట్స్ (పిజిఇ) కార్యాలయంలో 'ఓపెన్ హౌజ్' (బహిరంగ వేదిక) ను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఈనెల 6న బుధవారం ప్రవాసులకోసం ఢిల్లీలోని పిజిఇ కార్యాలయంలో ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 గం.ల వరకు 'ఓపెన్ హౌజ్' కార్యక్రమం 'ప్రవాసి ప్రజావాణి' జరుగుతుందని తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నంగి దేవేందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునేవారు పిజిఇ కార్యాలయం ఫోన్ నెం. 011 2467 3965  ఈ-మెయిల్:  [email protected] కు సంప్రదించవచ్చు. సలహాలు, సహాయం కోసం తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ హెల్ప్ లైన్ నెంబర్ 81435 88886 కు కాల్ చేయవచ్చు. 

గల్ఫ్ వలసకార్మికులు చాలాదూరం ఉన్న ఢిల్లీకి వెళ్లడం కష్టమని, దేశంలోని 10 ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రంట్స్ (పిఓఇ) కార్యాలయాలు హైదరాబాద్, ఢిల్లీ, ముంబయి, కొలకత్తా, చెన్నయి,చండీఘర్, కొచ్చిన్, త్రివేండ్రం, జైపూర్, రాయ్ బరేలి లలో 'ఓపెన్ హౌజ్' కార్యక్రమాలు నెలకు రెండుసార్లు నిర్వహించాలని దేవేందర్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.     

ఆరు దేశాల గల్ఫ్ సహకార మండలి (గల్ఫ్ కోపరేషన్ కౌన్సిల్ - జి.సి.సి) సభ్య దేశాలైన సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, బహ్రెయిన్, ఒమాన్, ఖతార్ తో పాటు ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, జోర్డాన్, లెబనాన్, లిబియా, మలేసియా, నార్త్ సుడాన్, సౌత్ సుడాన్, సిరియా, యెమెన్, ఇండోనేసియా, థాయిలాండ్ మొత్తం 18 దేశాలను భారత ప్రభుత్వం "విదేశాలకు వెళ్ళడానికి ప్రభుత్వ అనుమతి అవసరం" అయిన దేశాలు (ఇ.సి.ఆర్ - ఎమ్మిగ్రేషన్ క్లియరెన్స్ రిక్వయిర్డ్) గా వర్గీకరించింది. ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రెంట్స్ కార్యాలయాల ద్వారా ఎమిగ్రేషన్ ఆక్ట్ - 1983 ప్రకారం కార్మికుల విదేశీ వలసలను కేంద్ర ప్రభుత్వం నియంత్రిస్తున్నది. ఇ.సి.ఆర్ దేశాలలో సుమారు 85 లక్షల మంది (అత్యధికంగా గల్ఫ్ లోనే) భారతీయులు నివసిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో తెలంగాణ, ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రాలకు చెందినవారు చెరి 10 లక్షల మంది ఉన్నారని ఒక అంచనా. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com