జమ్మూ కశ్మీర్‌లోని కుల్గాం ఎన్కౌంటర్లో ఉగ్రవాది హతం
- September 01, 2017
జమ్మూ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో శనివారం ఉదయం నుంచి భద్రతా దళాలకు ఉగ్రవాదులకు మధ్య హోరాహోరీ కాల్పులు చోటుచేసుకున్నాయి. టాంట్రిపొరా ప్రాంతంలో కొనసాగుతున్న ఈ ఎన్కౌంటర్లో సైనికులు ఓ ఉగ్రవాదిని కాల్చి చంపారు. మృతిచెందిన ఉగ్రవాదిని మచివాకి చెందిన ఇస్ఫాక్ పద్దార్గా గుర్తించారు. కాగా శుక్రవారం పాకిస్తాన్ సైనిక మూకలు జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్ వద్ద కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయి. దీంతో నియంత్రణ రేఖ వద్ద పహారా కాస్తున్న బీఎస్ఎఫ్ జవాను ఒకరు ప్రాణాలు కోల్పోయినట్టు పోలీసులు వెల్లడించారు. ముస్లింలు పవిత్రంగా జరుపుకునే ఈద్-ఉల్-అధాకి సరిగ్గా ఒక్కరోజు ముందు పాకిస్తాన్ దళాలు కాల్పులకు తెగబడడం గమనార్హం.
తాజా వార్తలు
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!







