ఉంగరాల రాంబాబు విడుదల తేదీ ఖరారు
- September 05, 2017
సునీల్, మియాజార్జి జంటగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఉంగరాల రాంబాబు'. అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకొని ఈనెల 15న ఈ చిత్రం విడుదలకానుంది. యునైటెడ్ కిరీటి మూవీస్ లిమిటెడ్ బ్యానర్‌పై పరుచూరి కిరీటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్ని కమర్షియల్ హంగుల్ని రంగరించి తెరకెక్కించిన ఈ చిత్రం సునీల్ నటించిన గత చిత్రాలకంటే హై స్టాండర్డ్‌లో ఉంటుంది. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు దిల్‌రాజు వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ "ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత దిల్‌రాజుతో వాయిస్ ఓవర్ చెప్పించడానికి ఓ ప్రత్యే కమైన కారణం ఉంది. అది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందంటున్నారు సినిమా టీమ్. దర్శకుడు క్రాంతి మాధవ్ సిని మాను అద్భుతంగా తెరకెక్కించారు. కథలో భాగంగా వచ్చే కామెడీ ప్రేక్ష కులను నవ్విస్తుంది. ప్రకాష్‌రాజ్ కాంబినేషన్‌లో వచ్చే డైలాగ్స్ అందరినీ ఆలోచింపచేసే విధంగా ఉంటాయి. సునీల్ పాత్ర నవ్విస్తూ అందరినీ ఆలోచింపచేస్తుంది.
పాటలన్నీ ప్రేక్షకాదరణ పొందడం ఆనందంగా ఉం ది. పోసాని కృష్ణమురళి, వెన్నెల కిషోర్, అలీ, ఆశిష్ విద్యార్థి, రాజా రవీంద్రల పాత్రలు అందరినీ అలరిస్తాయి"అని అన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







