మోటార్ బైకులపై దొంగతనాలు చేసే ముఠా పట్టివేత
- September 07, 2017
కువైట్ : ఆరుగురు సభ్యులు గల ఒక దొంగల ముఠా ఇటీవల పోలీసులకు పట్టుబడింది. వీరికి అనేక దొంగతనాలతో సంబంధం ఉన్న నేపథ్యంలో పోలీసులు ఆ ముఠాను అరెస్టు చేశారు. భద్రతా వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం ఈ అనుమానితులు ఏడు బైకులను ఉపయోగించి చోరీలకు పాల్పడతారు. ఈ దొంగలు బైకులపై వేగంగా వచ్చి బాధితుల వెనుకనుంచి మొబైల్ ఫోన్లు, వెనుక తగిలించుకున్నసంచులు లేదా వారు తీసుకువెళుతున్న ఇతర విలువైన వస్తువులను లాక్కొని అక్కడ్నుంచి మాయమయ్యేవారు. అంతేకాకుండా ఈ అనుమానితులు పలు వాహనాలను కిటికీ అద్దాలను పగులగొట్టి అందులో ఉన్న పలు విలువైన వస్తువులను సైతం దొంగిలించారని భద్రతా వర్గాలు తెలిపాయి. ఆరుగురు సభ్యులు గల ఈ దొంగల ముఠాపై మొత్తం 23 దోపిడీ కేసులలో ప్రధాన నిందితులుగా ఉన్నట్లు వారు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
తాజా వార్తలు
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్







