పాక్, నీ వైఖిరి మార్చుకో - వార్నింగ్ ఇచ్చిన అగ్ర రాజ్యం
- September 07, 2017
వాషింగ్టన్ : ఉగ్రవాదంపై పాక్ అనుసరిస్తున్న వైఖరి మారాల్సిందేనని అమెరికా గట్టిగా కోరింది. చైనాలో 'బ్రిక్స్' సమావేశం విజయవంతం కావడంపై అమెరికా హర్షం వ్యక్తం చేసింది. ప్రపంచంలో కీలకపాత్ర పోషిస్తున్న 'బ్రిక్స్' శిఖరాగ్ర సమావేశంలో పాక్‌లోని ఉగ్రవాద ముఠాలను నియంత్రించాలని కోరిన విషయం తెలిసిందే. దీనిపై అమెరికా ప్రతినిధి హర్షం వ్యక్తం చేస్తూ ఉగ్రవాదుల ముఠాలను నియంత్రించాలని పాక్‌కు సూచించింది. బ్రిక్స్ తీర్మానంలో ఆఫ్గన్ తాలిబాన్, ఇస్లామిక్‌స్టేట్, అల్‌ఖైదా, హక్కానీ ఉగ్రవాదులు, లష్కర్, జైష్ ఎ మహమ్మద్, తెహ్రిక్ తాలిబాన్ పాకిస్థాన్, హిజ్బుల్ తహ్రీర్ గ్రూపులను ప్రస్తావించారు. 'బ్రిక్స్'లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా సభ్యదేశాలుగా ఉన్నాయి. బ్రిక్స్ వేదికగా తొలిసారి పాక్, ఆఫ్గన్లోని ఉగ్రవాదుల ముఠాలను నిర్మూలించాలని తీర్మానం చేయడం విశేషం.
ఉగ్రవాదులకు నిధులు అక్కడ నుంచే..
ఉగ్రవాదులకు నిధులను సమకూర్చడంతో పాటు ప్రజాసొమ్మును అక్రమ మార్గాల ద్వారా తరలించేందుకు వీలుగా పాక్ ఉందని స్విస్ అధ్యయనకేంద్రం బసెల్ తెలిపింది. ఈ విభాగంలో పాక్ 46వ స్థానంలో ఉందని వెల్లడించింది. ఇరాన్, ఆఫ్గనిస్థాన్, తజికిస్థాన్, లావోస్, మొజాంబిక్, మాలి, ఉగండా, కాంబోడియా... తదితర దేశాలనుంచి మనీలాండరింగ్ ఎక్కువగా జరుగుతోందని నివేదికలో వెల్లడైంది.
ఈ దేశాలు బాగున్నాయి..
మనీలాండరింగ్ నియంత్రణలో ఫిన్లాండ్, లిథ్వేనియా, ఎస్టోనియా, బల్గేరియా, న్యూజిలాండ్, స్లోవేనియా, డెన్మార్క్... తదితర దేశాలు కఠినమైన చర్యలు తీసుకోవడాన్ని బసెల్ ప్రశంసించింది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







