కడుపు పండాలంటే.. ద్రాక్షపండ్లు ఎక్కువగా తీసుకోండి

- September 07, 2017 , by Maagulf
కడుపు పండాలంటే.. ద్రాక్షపండ్లు ఎక్కువగా తీసుకోండి

ద్రాక్ష పండ్లలో పిండిపదార్థాలు, చక్కెర పదార్థాలతో పాటు విటమిన్ -ఎ, విటమిన్-బి1 విటమిన్లు పుష్కలంగా వుంటాయి.  విటమిన్ సి, విటమిన్-కె వంటి విటమిన్లు, క్యాల్షియం, ఐరన్, ఫాస్పరస్ లాంటి ఖనిజ లవణాలు మెండుగా ఉంటాయి. ద్రాక్ష వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. మూత్రపిండ సమస్యలతో బాధపడే వారికి మంచి ఔషధంగా పనిచేస్తుంది. 
కొలెస్ట్రాల్‌ను అదుపు చేయడం, క్యాన్సర్‌ను ఎదుర్కోవడంలో కూడా ద్రాక్ష ఉపయోగపడుతుంది. ఆస్తమా, గుండె జబ్బులు, అజీర్ణం, మైగ్రేయిన్‌.. ఇలా చాలా రోగాలకు ద్రాక్ష అద్భుతంగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పండ్లుగానే తినడంతో పాటు పానీయంగా, సలాడ్లుగా కూడా ద్రాక్షను తీసుకోవడం మంచిది.
సంతానలేమితో ఇబ్బంది పడే దంపతులు.. ఎక్కువగా ద్రాక్ష పండ్లు తినడం ద్వారా కడుపు పండేందుకు అవకాశాలు మెరుగవుతాయి. ద్రాక్ష పండ్లతోపాటు బ్లూబెర్రీలు, వేరుశనగలోనూ ఉండే యాంటీ యాక్సిడెంట్‌లు పుష్కలంగా వుండటంతో సంతానలేమిని దూరం చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com