యూఏఈ స్కూల్ ఇయర్ ప్రారంభం 79 ట్రాఫిక్ పెట్రోల్స్ వినియోగం
- September 08, 2017
షార్జా: కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతుండడంతో షార్జా పోలీసులు సరికొత్త ట్రాఫిక్ ప్లాన్‌తో ముందుకొస్తున్నారు. 79 ట్రాఫిక్ పెట్రోల్స్‌ని వినియోగించనున్నారు. పీక్ అవర్స్‌లో ఈ ట్రాఫిక్ పెట్రోల్స్ ఎక్కడా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూడనున్నాయి. ఎమిరేట్ వ్యాప్తంగా అన్ని రోడ్లపైనా వీటిని వినియోగిస్తారు. కొన్ని పెట్రోల్స్, స్కూల్ జోన్స్ వద్ద ఏర్పాటు చేస్తున్నారు. సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్స్ వంటి సౌకర్యాల ద్వారా కమ్యూటర్స్‌ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసేందుకూ చర్యలు చేపడతారు. మేజర్ అల్ నబ్కి మాట్లాడుతూ, ట్రాఫిక్ నిబంధనల్ని ప్రతి ఒక్కరూ పాటించాలనీ, స్కూల్ యాజమాన్యాలు ట్రాఫిక్ సమస్యలకు సంబంధించి పోలీసులకు సమాచారం అందజేయాలనీ, పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. భద్రత విషయమై అధికారులు స్కూలు విద్యార్థులు, యాజమాన్యాలతోనూ ఇంటరాక్ట్ అయి వారికి కొన్ని సూచనలు చేయడంతోపాటు, వారి నుంచీ కొన్ని సూచనల్ని అందుకున్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







