మేనల్లుడి తో వెంకీ మల్టీస్టారర్ ..!!
- September 09, 2017
టాలీవుడ్లో సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు తో మొదలైన మల్టిస్టారర్ల హవా తగ్గడం లేదు. చిన్న హీరోలే కాదు పెద్ద హీరోలు కూడా మల్టిస్టారర్లలో నటించేందుకు రెడీ అంటున్నారు. లేటెస్ట్ గా ఓ సీనియర్ స్టార్ హీరో, తన మేనల్లుడుతో కలసి సినిమా చేయబోతున్నాడనే వార్త హల్ చల్ చేస్తోంది.
చాలా కాలం తర్వాత టాలీవుడ్లో మల్టిస్టారర్ల ట్రెండ్ ని రీ స్టార్ట్ చేసిన వెంకటేష్, మరో మల్టిస్టారర్లో నటించేందుకు రెడీ అవుతున్నాడనే వార్త ఇప్పుడు టాలీవుడ్లో హల్ చల్ చేస్తోంది. వెంకటేష్ హీరోగా తెరకెక్కే ఈ కుటుంబ కథా చిత్రంలో, మరో పాత్రలో తన మేనల్లుడు నాగచైతన్య నటించబోతున్నాడట. చైతూ నటించిన ప్రేమమ్ లో వెంకటేష్, మేనమామగా గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చి సినిమాకి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాడు. ఇప్పుడు ఫుల్ లెంగ్త్ మూవీలో మామా అల్లుళ్ళు కలసి నటించబోతున్నారు. వెంకీ, నాగచైతన్య కాంబోలో తెరకెక్కే మల్టిస్టారర్ కి కళ్యాణ్ కృష్ణ దర్శకుడు. సోగ్గాడే చిన్ని నాయనా, రారండోయ్ వేడుక చూద్దాం చిత్రాలతో హిట్స్ అందుకున్న ఈ దర్శకుడు, మరో కుటుంబ కథా చిత్రానికి ప్లాన్ చేస్తున్నాడు. ముందుగా వెంకీని ఒప్పించి, వెంకీ ద్వారానే చైతూని కూడా ఈ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నాడనే టాక్ ఇండస్ట్రీలో హల్ చల్ చేస్తోంది.
తాజా వార్తలు
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!







