సీనియర్‌ నటి బి.వి. రాధ కన్నుమూత

- September 10, 2017 , by Maagulf
సీనియర్‌ నటి బి.వి. రాధ కన్నుమూత

చెన్నై: సీనియర్‌ నటి బి.వి. రాధ(70) బెంగళూరులో కన్నుమూశారు.ఆదివారం ఉదయం గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు. ఆమె దక్షిణాదిలో దాదాపు 300 చిత్రాల్లో నటించారు. 1964లో 'నవకోటి నారాయణ' అనే కన్నడ చిత్రంతో నటిగా చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత తెలుగు, తమిళ, మలయాళ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు.
దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్‌, అక్కినేని నాగేశ్వరరావు, ఎంజీఆర్‌, శివాజీ గణేశన్‌ తదితరులతో కలిసి రాధ నటించారు. పలు చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com