రాగి రొట్టె
- September 10, 2017
కావలసిన పదార్థాలు : రాగిపిండి - 2 కప్పులు, ఉల్లిపాయ తరుగు - అర కప్పు, పచ్చిమిర్చి తరుగు - 1 టీ స్పూను, కరివేపాకు తరుగు - 1 టేబుల్ స్పూను, పచ్చికొబ్బరి కోరు - 2 టేబుల్
స్పూన్లు, క్యాప్సికం తరుగు - అర కప్పు, ఉప్పు - రుచికి తగినంత, నూనె - ఒక రొట్టెకు ఒక టీ స్పూను చొప్పున.
తయారుచేసే విధానం: ఒక వెడల్పాటి పాత్రలో కూరగాయల తరుగు, పిండి, ఉప్పు వేసి తగినంత నీటితో ముద్దలా చేసుకోవాలి. తర్వాత అరిటాకు పైన నూనె రాస్తూ కొంత కొంత పిండిని తీసుకుని రొట్టెలా సాధ్యమైనంత పలచగా ఒత్తుకుని పెనంపై కొంచెం నూనె వేసుకుని కాల్చుకోవాలి. వీటిని వేడివేడిగా టమోటా చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి.
తాజా వార్తలు
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్కు మూడు కొత్త బస్సు మార్గాలు







