ఎన్టీఆర్ 'జై లవ కుశ'మూడు పాత్రల్లో అదుర్స్...
- September 10, 2017
తెలుగు ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో జూనియర్ ఎన్టీఆర్. ఇప్పటి వరకు ఎన్నో వైవిధ్య భరిత పాత్రల్లో నటించిన ఎన్టీఆర్ తాజాగా బాబీ దర్శకత్వంలో నందమూరి కళ్యాన్ నిర్మాణ సారథ్యంలో 'జై లవ కుశ' చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఎన్టీఆర్ మూడు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే మూడు పాత్రలకు సంబంది ఫస్ట్ లుక్, టీజర్లు రిలీజ్ అయ్యాయి.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ ఈ రోజు రిలీజ్ చేశారు. మొదటి నుంచి చిత్ర కథ పై రక రకాల రూమర్లు పుట్టుకొస్తున్నా..కథ విషయంలో మాత్రం చాలా జాగ్రత్త తీసుకుంటున్నారు. ట్విస్ట్ ఏంటంటే ఈ చిత్రంలో ఇద్దరు హీరోలు అయితే ఒక పాత్ర మాత్రం విలన్ గా ఉండబోతుందట. అంతే కాదు మొదటి నుంచి 'జై' పాత్రను చాలా వైలెంట్ గా చూపిస్తూ వస్తున్న విషయం తెలిసిందే.
మొదట్లో 'కుశ' చేసే తుంటరి పనులు, 'లవ' అమాయకత్వంతోపాటు అతనిలో దాగివున్న చిలిపితనాన్ని, ఆ తర్వాత సగం వీడియోని 'జై' పాత్రని చూపించారు. ఇక జై పాత్ర విషయానికి వస్తే మాత్రం చాలా వైల్డ్ గా చూపించారు. అయితే ఎన్టీఆర్ ఈ మూడు పాత్రల్లో తన నట విశ్వరూపాన్ని చూపించారు..ఏ పాత్రకు ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసినట్లు కనిపిస్తుంది. ముందు నుంచి ఎన్ని అంచనాలు పెరిగాయో..ఆ అంచనాలకు తగ్గట్లు ట్రైలర్ కనిపిస్తుంది.
ఇప్పటికే ఇండస్ట్రీలో హ్యాట్రిక్ విజయం సాధించిన ఎన్టీఆర్ ఇప్పుడు మరో సూపర్ డూపర్ హిట్ కొడతాడని నందమూరి ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. ఇకపోతే.. ఇద్దరు హీరోయిన్లు రాశీఖన్నా, నివేదా థామస్‌లతోపాటు హంసానందిని, నందితా ఇలా కనిపించి అలా మాయమైపోయారు. చివర్లో మూడు పాత్రల్ని నాటకంలో భాగంగా ఒకేసారి చూపించడం సినిమాపై మరింత ఆసక్తి పెరుగుతుంది. ఏది ఏమైనా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందాలకు అవధులే లేకుండా పోయాయి.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







