ఎంత పెద్ద నడుము నొప్పికైనా సింపుల్ చిట్కా
- September 10, 2017
నడుము నొప్పి ఎన్నో విధాలుగా ఉంటుంది. నడుము కింద భాగాన నొప్పి వస్తే లోయర్ బ్యాక్ పెయిన్ అంటారు. లోయర్ బ్యాక్ పెయిన్ అంటే రక్తప్రసరణ తగ్గి చిక్కగా అయినప్పుడు ఈ పెయిన్ వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎక్కువసేపు కూర్చుని ఉండటం వల్ల ఈ పెయిన్ వస్తుంది. ఉద్యోగ పరంగా గాని, ఇతర ఏ కారణాల వల్ల గాని ఎక్కువసేపు కూర్చున్న వారికి ఖచ్చితంగా బ్యాక్ పెయిన్ వస్తుంది.
ఎక్కువసేపు కూర్చుంటే బ్యాక్ పెయిన్ మాత్రమే కాదు. బరువు కూడా పెరిగిపోతారు. ఉదాహరణకి.. ఏదైనా రెస్టారెంట్‌కు వెళ్ళినప్పుడు గమనించండి.. అక్కడ నిల్చుని పనిచేసే సర్వర్లు సన్నగా ఉంటారు. కూర్చుని ఉండే క్యాషియర్లు లావుగా ఉంటారు. నిల్చుని పనిచేసే వారికి ఆరోగ్య సమస్యలు కూడా పెద్దగా రావట.
బ్యాక్ పెయిన్ తగ్గాలంటే కూర్చునే సమయాన్ని తగ్గించాలి. పొగత్రాగి ఆరోగ్యాన్ని ఏ విధంగా అయితే కొంతమంది నాశనం చేసుకుంటారో.. అలాగే ఎక్కువసేపు కూర్చుంటే అదేవిధంగా ఆరోగ్యం నాశనమై పోతుందని వైద్యనిపుణుల పరిశోధనలో వెల్లడైంది. ఎక్కువ సేపు ఒకవేళ కూర్చునేవారు వాకింగ్ చేయడం కాని లేకుంటే యోగా చేయడం కానీ చేస్తే లోయర్ బ్యాక్ పెయిన్ తగ్గిపోయి ఆరోగ్యంగా ఉంటారట.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







