ఇలాచి షర్బత్
- September 13, 2017
కావలసినవి: ఇలాచి (యాలక్కాయలు) - ఏడు, పంచదార - నాలుగు టీస్పూన్లు, నిమ్మకాయ - సగం చెక్క, నీళ్లు - మూడు కప్పులు.
తయారీ: ఒక కప్పు నీళ్లను వేడిచేసి యాలక్కాయలు వేయాలి. అవి వేశాక మరో ఐదు నిమిషాలు మంట మీదనే ఉంచి తరువాత స్టవ్ మీద నుంచి దింపేయాలి. ఈ నీళ్లను పక్కనపెట్టి చల్లార్చాలి. మిగిలిన రెండు కప్పుల నీళ్లతో పంచదార సిరప్ను తయారుచేయాలి. నీళ్లలో పంచదార కరిగే వరకు స్టవ్ మీద గిన్నె ఉంచి దింపేయాలి. ఇది కూడా చల్లారాక యాలక్కాయల నీళ్లు, నిమ్మరసం కలిపి రిఫ్రిజిరేటర్లో పెట్టాలి. చల్లచల్లగా తాగితే ఇలాచి ఫ్లేవర్ వేసవి వేడినుంచి ఉపశమనాన్ని కలిగించడం ఖాయం.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







