మస్కట్ అపోలో హాస్పిటల్లో చిన్నపిల్లల వ్యాధి ' తలాసేమియా ' క్లినిక్ ప్రారంభం
- September 14, 2017
మస్కట్ : గత కొన్ని సంవత్సరాలుగా చెన్నైలోని అపోలో హాస్పిటల్లో చిన్నపిల్లల వ్యాధి ' తలాసేమియా ' ఒమన్ కు చెందిన100 మందికి పైగా పిల్లలు చికిత్స పొందుతున్నారు. వంశపారంర్యంగా వచ్చే రక్త దోషములకి ( తలాసేమియా ) సంబంధించిన ఈ వ్యాధితో ఒమన్ లో1,000 మంది పిల్లల కేసులలో దాదాపు 110 మంది చిన్నారులకు ఇక్కడ విజయవంతమైన చికిత్సను అందిస్తున్నట్లు సోమవారం మస్కట్ అపోలో హాస్పిటల్ మొదటి అంతర్జాతీయ పీడియాట్రిక్ తలాసేమియా క్లినిక్ ను ప్రారంభించినట్లు అపోలో హాస్పిటల్స్ గ్రూపు అధ్యక్షుడు డాక్టర్ కె. హరిప్రసాద్ తెలిపారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ అపోలో హాస్పిటల్ ను మస్కట్ లో ఈ క్లినిక్ ప్రారంభోత్సవం ప్రకటించటం ఆనందంగా ఉంది. చెన్నైలోని మా ఆసుపత్రిలో ఎముకలలోని మూలుగ మార్పిడి బోన్ మారో ట్రాన్స్ప్లాంట్స్ (బి ఏం టి ) ఈ ప్రత్యేకమైన వైద్యం ఉందని అన్నారు , ఇక్కడ వైద్యులు అమెరికా సంయుక్త, బ్రెజిలియన్ మరియు ఇండియన్ రిజిస్ట్రీలోని నేషనల్ మారో దొనెర్ ప్రోగ్రామ్ లో సైతం పనిచేసిన అనుభవం ఉందని తెలిపారు ఈ సేవను 40 దేశాల నుండి రోగులకు అందించడానికి మేము విశేషంగా కృషిచేస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







