ప్రపంచశాంతి-న్యాయం, ఉగ్రవాద వ్యతిరేక పోరు సదస్సు

- October 29, 2015 , by Maagulf
ప్రపంచశాంతి-న్యాయం, ఉగ్రవాద వ్యతిరేక పోరు సదస్సు

రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఇండో-అరబ్ ఫ్రెండ్‌షిప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరగనున్న సదస్సుకు హాజరవుతారు. కేంద్ర హోంమంత్రి అధ్యక్షత వహించే ఈ సదస్సులో పలు రాష్ర్టాల హోం మంత్రులు హాజరవుతున్నారు. ప్రపంచశాంతి-న్యాయం, ఉగ్రవాద వ్యతిరేక పోరు అనే అంశంపై జరగనున్న ఈ సదస్సులో వివిధ రాష్ర్టాలు తీసుకోవాల్సిన చర్యల గురించి రాజ్‌నాథ్‌సింగ్ వివరిస్తారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యల గురించి నాయిని నర్సింహారెడ్డి సదస్సులో వివరిస్తారు. ఉగ్రవాద, తీవ్రవాద చర్యలకు తావులేని విధంగా రాష్ట్ర పోలీసు యంత్రాంగం చేపడుతున్న చర్యల గురించి ఈ సదస్సుకు తెలియజేస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com