పైరసీ పై యుద్దానికి సిద్ధం అంటున్న హీరో విశాల్
- September 14, 2017
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ రీల్ హీరోనే కాదు.. రియల్ హీరో అని చాలా సార్లు నిరూపించుకొన్నాడు. అనేక విప్లవాత్మక మార్పులకు నాంది పలికాడు.. నడిగర్ సంఘం లో చోటు చేసుకొన్నఅవకతవకలను ప్రశ్నిస్తూ విశాల్ మొదలు పెట్టిన పోరాటం... నిర్మాతల సంఘం కు ప్రెసిడెంట్ అయ్యి పైరసీని అరికట్టే దిశగా అడుగులు వేశాడు..
కోలీవుడ్ నిర్మాతలకు నిద్రలేకుండా చేస్తున్న తమిళ్ రాకర్స్ కు తమిళ్ గన్ వంటి వైరసీ వెబ్ సైట్స్ తోడయ్యాయి. సినిమా రిలీజైన గంటలోనే ఆన్ లైన్ లో సినిమాలు కనిపిస్తున్నాయి.. దీంతో ఆన్ లైన్ పైరసీ పై కోలీవుడ్ యుధ్ధం చేస్తోంది.. విశాల్ కు ఏ చిన్న పతి సమాచారం అందినా లేదా తనకు ఏమాత్రం పైరసీ విషయం తెలిసినా వెంటనే రంగంలోకి దిగుతున్నాడు. కానీ ఈ వెబ్ సైట్ల అడ్మిన్లు చెన్నైలో ఉంటూ.. విదేశాల్లో అక్రమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. దీంతో పైరసీని అడ్డుకోవడం కష్టసాధ్యమవుతుంది అని సైబర్ పోలీసులు తమ అసహాయతను తెలియజేశారు.. కాగా తాజాగా చెన్నై ట్రిప్లికేన్ లో తమిళగన్ అడ్మిన్ గా భావిస్తున్న గౌరి శంకర్ అనే వ్యక్తి ని సైబర్ పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.. ఇతను తమిళ్ రాకర్స్ అడ్మిన్ అంటూ ప్రచారం సాగగా.. ఆ వెబ్ సైట్ నిర్వాహకులు ఆ వార్తల్లో నిజం లేదని ప్రకటించారు.. కానీ తమిళగన్ వెబ్ సైట్ నిర్వాహకులు "అమాయకుల్ని అరెస్ట్ చేయకండి.. మీకు చేతనైతే "తుప్పరివాలన్" ని కాపాడుకోండి.. అని సవాల్ విసురుతూ మెసేజ్ చేశారు.. విశాల్ తాజా సినిమా 'తుప్పరివాలన్ ' ఈరోజు రిలీజ్ అవుతున్న నేపద్యంలో పైరసీ దారులు టార్గెట్ చేసుకొన్నారు. పైరసీపై విశాల్ చేస్తున్న మరో స్థాయికి చేరుకోగా.. పోరాటం ఫలించాలని నిర్మాతలు కోరుకొంటున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







