గుమ్మడి చేసే మేలు... స్త్రీలకు, పురుషులకు...
- September 14, 2017
తెలుగువారి యింటి ముంగిట గుమ్మడిపండును వ్రేలాడదీయడం మనం నిత్యం చూస్తాము. బూడిదగుమ్మడిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. గుమ్మడి కూరగాను వడియాలు గాను వాడతాము. కడుపులో మంటగాని, ఉబ్బరంగాని, అతిదాహం ఉన్నప్పుడు బూడిదగుమ్మడిని తినడం వలన గ్యాస్ ట్రబుల్ నివారించవచ్చు. కడుపులో ఏలికపాములు వున్నప్పుడు గుమ్మడి గింజలను ఎండబెట్టి ఆ తరువాత దోరగా వేయించి, మెత్తగా దంచి ఉప్పు, కారం తగినంత కలుపుకొని తినవచ్చు అలా వాడితే కడుపులోని పురుగులు పడిపోతాయి.
బూడిదగుమ్మడి రక్తపుష్టిని కలిగిస్తుంది. గర్భాశయ వ్యాధులతో బాధపడే స్త్రీలకు ఇది చలవ చేసి రక్తపుష్టిని కలిగించడానికి దోహదపడుతుంది. బూడిదగుమ్మడి లివర్ వ్యాధులన్నింటిలోను అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా కామెర్ల వ్యాధిలో తీవ్రతను తగ్గిస్తుంది. ఊపిరితిత్తుల వ్యాధులలో, టి.బి. వ్యాధిలోను నిస్సత్తువను పోగొడుతుంది. ఊపిరితిత్తులకు బలాన్ని యిస్తుంది. బూడిద గుమ్మడి మూత్రవ్యాధులలో చక్కగా పనిచేస్తుంది. మూత్రంలో మంటను చీము దోషమును తగ్గిస్తుంది.
మొలలు వ్యాధిలో రక్తం పడుతున్న సందర్భంలో బూడిదగుమ్మడి తీసుకుంటే రక్తం పడటం ఆగుతుంది. మొలల వ్యాధితో బాధపడేవారు తమ చికిత్సలో బూడిదగుమ్మడి కూడా చేర్చితే వ్యాధి త్వరగా తగ్గుతుంది. బూడిద గుమ్మడి మెదడుకు చలువ చేస్తుంది. పిల్లలకు హల్వాలా తయారుచేసి పెడితే మెదడు చురుకుగా పనిచేస్తుంది. మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడి బాధపడుతున్నవారు బూడిదగుమ్మడి కాయతో మినపప్పు బదులుగా ఉలవలుతో వడియాలు పట్టుకుని తింటే మూత్రపిండాలలో రాళ్ళు కరుగుతాయి.
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







