కోనేరు మధుకు 'ఎమ్మార్'తో సంబంధం లేదు
- September 14, 2017
హైదరాబాదు: ఎమ్మార్ కుంభకోణానికి సంబంధించిన కేసుతో కోనేరు మధుకు సంబంధం లేదని, కుట్ర జరిగిన సమయంలో ఆయన విదేశాల్లో ఉన్నారని మధు తరఫున మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ హైకోర్టుకు నివేదించారు. ఎమ్మార్ కుంభకోణంలో తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కోనేరు రాజేంద్రప్రసాద్ కుమారుడు మధు దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్‌ను జస్టిస్ శివశంకర్‌రావు గురువారం విచారించారు. 'ఎమ్మార్ కుంభకోణం కుట్ర ఇక్కడ జరిగింది. ఆ సమయంలో మధు విదేశాల్లో ఉన్నారు. రాజేంద్ర ప్రసాద్ సూచన మేరకే మధు ఖాతాలో డబ్బు డిపాజిట్ చేసినట్లు సీబీఐ ఆరోపిస్తోంది. అయితే ఆ డబ్బును మధు వాడుకోలేదు. తిరిగి వారికి చెల్లించారు. మధుపై కేసును కొట్టివేయండి' అని రోహత్గీ నివేదించారు. ఈ పిటిషన్‌పై సీబీఐ వాదనలు వినిపించేందుకు తదుపరి విచారణను ఈనెల 18కి వాయిదా వేశారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







