కువై ట్ లో వచ్చేవారం వేసవి కాలం ముగియనుంది
- September 15, 2017
కువైట్: రాబోయే రోజులలో ఉష్ణోగ్రతలు మితంగా ఉంటుందని భావిస్తున్నాయని కువైట్ మెట్రోలొలాజికల్ సెంటర్ తెలిపింది. అల్ప పీడన స్థితి కారణంగా వాతావరణ పరిస్థితులలో మెరుగుదల కనబడుతుంది. తాజా ఉత్తర గాలికి మధ్యస్థమైన ఊపు అందుకొని బహిరంగ ప్రాంతాల్లో ధూళిని రేకెత్తిస్తుంది గంటకు 20 - 42 కిలోమీటర్ల వేగంతో ఆ గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రంలో అధికారి ధీర్ర్ అల్-అలీ గురువారం " మా గల్ఫ్ డాట్ కామ్ " కు చెప్పారు. రాత్రి వేళలో వెచ్చని గాలుల నుండి తేలికపాటి గాలికి మార్పు చెందుతుందని తెలిపారు. అదేవిధంగా గాలి వేగం గంటకు 08 కిలోమీటర్ల నుండి 30 కి.మీ వేగంతో వీచే అవకాశముందని వివరించారు. వాతావరణం చాలా వేడిగా ఉంటుంది. గురువారం అత్యధిక ఉష్ణోగ్రత 47 డిగ్రీల సెల్సియస్ చేరుకొంది , కనిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్ వరకు శుక్రవారం ఉంటుంది. వెచ్చని తేలికపాటి గాలులు గంటకు 06 కిలోమీటర్ల 28 కిలోమీటర్ల వేగంతో ఉంటుంది; అత్యధిక ఉష్ణోగ్రత 47 డిగ్రీల సెల్సియస్ కు చేరుకుంటుంది, అత్యల్ప ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్ గా ఉంటుంది. శనివారం వాతావరణం అధికారికంగా చాలా వేడిగా ఉంటుంది. అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్ కు చేరుకుంటుంది, అత్యల్ప ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్ గా ఉంటుంది. దక్షిణాది విషువత్తు కారణంగా వాతావరణం మారిపోయి సెప్టెంబర్ 22 వ తేదీ నుంచి కువైట్ లో వేసవి కాలం ముగియనుందని పగటిపూట మరియు రాత్రి సమయము ఒకదానితో ఒకటి సమానంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- దుబాయ్లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!







