1 దిర్హామ్‌కే పిజ్జా: ఎగబడ్డ జనం
- September 15, 2017
ఇటాలియన్ రెస్టారెంట్ రిసెట్టా, తమ కొత్త బ్రాండ్ పిజ్జా ప్రమోషన్‌లో భాగంగా వినియోగదారులకు 1 దిర్హామ్‌కే పిజ్జా అందించేలా కొత్త స్కీమ్‌ని ప్రకటించింది. సెప్టెంబర్ 15న తొలి వంద మంది వినియోగదారులకు మాత్రమే ఈ ఆఫర్‌ని ప్రకటించింది ఆ సంస్థ. అంతే ఉదయం 7.30 నిమిషాలకే తొలి కస్టమర్ 1 దిర్హామ్ వెచ్చించి, పిజ్జా సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత పెద్ద సంఖ్యలో అక్కడికి పిజ్జా లవర్స్ చేరుకున్నారు. ఇటాలియన్ రెస్టారెంట్లలో పిజ్జా చాలా చాలా ప్రత్యేకమైన వంటకం, చాలా ఎక్కువమంది మెచ్చే వంటకం కూడా. రిసెట్టాలోని పిజ్జా సెలక్షన్‌లో వివిధ రకాలైన ఫ్లేవర్లలో వెరైటీ పిజ్జాలు లభిస్తాయి. షెరటన్ బుర్ దుబాయ్ -ఫోర్ పాయింట్స్ వద్ద ఈ పిజ్జా సందడితో పండగ వాతావరణం నెలకొంది.
తాజా వార్తలు
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!







