పాకిస్తానీ డ్రైవర్‌కి క్లిష్టతరమైన శస్త్ర చికిత్స
- September 15, 2017
దుబాయ్‌లో ఓ పాకిస్తానీ డ్రైవర్‌కి అత్యంత సంక్లిష్టమైన శస్త్ర చికిత్స జరిగింది. డాక్టర్ గిరీష్ చంద్ర వర్మ, ఆర్టిక్ రూట్ రీప్లేస్మెంట్ సర్జరీని నిర్వహించారు. డ్రైవర్‌గా పనిచేస్తున్న పాకిస్తానీ వలసదారుడికి ఈ శస్త్ర చికిత్స నిర్వహించారు. హ్యూమన్ బాడీలో ఆర్టా అనేది అత్యంత క్లిష్టమైన ఆర్టెరీ. గుండె నుంచి స్వచ్ఛమైన రక్తాన్ని శరీరంలోని వివిధ విభాగాలకు ఈ పార్ట్ అందిస్తుంటుంది. హార్ట్ ఫెయిల్యూర్‌తో రోగి ఫఖార్ ఉల్ ఇస్లామ్ అజ్మన్‌లోని ఓ ఆసుపత్రికి తరలించబడ్డాడు. అనంతరం అతన్ని ఎన్ఎంసి స్పెషాలిటీ హాస్పిటల్లో చేర్పించారు. సీటీ స్కాన్ సహా పలు పరీక్షల అనంతరం డాక్టర్ వర్మ, రోగికి అత్యవసర శస్త్ర చికిత్స నిర్వహించాలని నిర్ధారించారు. గుండె కొట్టుకుంటుండగానే, అత్యంత నైపుణ్యంతో డాక్టర్ వర్మ శస్త్ర చికిత్స నిర్వహించారు. దుబాయ్‌లో ఇప్పటిదాకా ఇలాంటి సర్జరీ ఒకే ఒక్కసారి జరిగిందని చెప్పారు. శస్త్ర చికిత్స విజయవంతమయ్యిందని ఆయన చెప్పారు. 99 శాతం హార్ట్ పేషెంట్లు డయాబెటిక్ లేదా స్మోకర్స్ ఉంటున్నారని డాక్టర్ వర్మ తెలిపారు.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







