క్యారెట్ బెల్ పెప్పర్ సూప్
- September 17, 2017
కావలసినవి: క్యారెట్, రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, టొమాటో- అరకప్పు చొప్పున, ఎండుమిర్చిగింజలు, లవంగాలు, యాలకలు- అరటీస్పూను చొప్పున, మిరియాలు- పావుటీస్పూను. ఉప్పు- తగినంత.
తయారీ: ఒక గిన్నెలో క్యారెట్, క్యాప్సికం, టొమాటోలు ముక్కలు వేసి రెండు కప్పులు నీళ్లు పోసి అవి మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి. స్టవ్ ఆపేసాక ముక్కల్ని మెత్తగా మెదపాలి. ఈ మిశ్రమాన్ని మరొక గిన్నెలోకి తీసుకొని ఎండుమిర్చి గింజలు, లంవంగాలు, యాలకలు, ఉప్పు, మిరియాలు వేసి పావు కప్పు నీళ్లు పోసి కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్నమంటపై రెండు నిమిషాలపాటు ఉడికించి స్టవ్ ఆపేయాలి. దీన్ని వేడి వేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







